Mumbai Times Tower : ముంబైలోని టైమ్స్ టవర్ భవనంలో భారీ అగ్నిప్రమాదం

A massive fire broke out in the Times Tower building in Mumbai
x

 Mumbai Times Tower : ముంబైలోని టైమ్స్ టవర్ భవనంలో భారీ అగ్నిప్రమాదం

Highlights

Mumbai Times Tower : ముంబైలోని రద్దీ ప్రాంతమైన లోయర్ పరేల్ వెస్ట్‌లోని టైమ్స్ టవర్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు బీఏఎంసీ తెలిపింది. ఘటనా స్థలంలో 9 ఫైరింజన్లు ఉన్నట్లు తెలిపింది.

ముంబైలోని లోయర్ పరేల్ వెస్ట్ ప్రాంతంలో ఉన్న టైమ్స్ టవర్ భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ భవనం కమల మిల్లులో ఉంది. మంటలను ఆర్పేందుకు 9 అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. ఈ ఘటనను బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ధృవీకరించింది.

మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నామని బీఎంసీ తెలిపింది. టైమ్స్ టవర్ ముంబైలో చాలా రద్దీగా ఉండే ప్రాంతంలో ఉందన్న సంగతి తెలిసిందే. బృహన్ ముంబై మున్సిపాలిటీ ఈ సంఘటనకు సంబంధించి తాజా అప్ డేట్ ను విడుదల చేసింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని.. మంటలను ఆర్పే పని జరుగుతోందని వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories