పాపమని బైక్ పై లిఫ్ట్ ఇస్తే బైక్ తో ఉడాయించింది...

పాపమని బైక్ పై లిఫ్ట్ ఇస్తే బైక్ తో ఉడాయించింది...
x
Highlights

మా బంధువులు ఉన్నారని ఇంటికి వెంటనే వెళ్ళాలని లిఫ్ట్ అడిగినా ఓ యువతీ అదును చూసి లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి బైక్ నే పట్టుకొని ఉడాయించింది... ఈ ఘటన కడపలో...

మా బంధువులు ఉన్నారని ఇంటికి వెంటనే వెళ్ళాలని లిఫ్ట్ అడిగినా ఓ యువతీ అదును చూసి లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి బైక్ నే పట్టుకొని ఉడాయించింది... ఈ ఘటన కడపలో చోటు చేసుకుంది . దీనికి సంబంధించిన వివరాలను సీఐ సత్యబాబు మీడియాకి వెల్లడించారు . ఈ నెల 17న శివ అనే యువకుడు తన బైక్ పై వెళ్తుండగా బసిరెడ్డి లీలావతి (21) అనే యువతీ రిమ్స్‌లో తమ బంధువులు ఉన్నారని వెంటనే వెళ్ళాలని దయచేసి లిఫ్ట్ ఇవ్వాలని కోరింది . ఈ మేరకు లిఫ్ట్ ఇచ్చిన శివకి మార్గమధ్యంలో ఫోన్ రాగా బైక్ ని ఆపి పక్కాకి వెళ్ళాడు . ఇదే సరైనా టైంని అని అనుకున్న అ యువతీ బైక్ స్టార్ట్ చేసుకొని ఉడాయించింది. దీనిపైన భాదితుడు అయిన శివ పోలీసులకు కంప్లేంట్ చేయగా పోలీసులు ఈ నెల 21న నిందితురాలుని పట్టుకున్నారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories