ప్రణయ్ హత్య కేసులో కీలక అడుగు..సుమారు 1600 పేజీల...

ప్రణయ్ హత్య కేసులో కీలక అడుగు..సుమారు 1600 పేజీల...
x
Highlights

నల్గొండలోని మిర్యాలగూడలో గతేడాది జరిగిన ప్రణయ్ హత్య కేసులో కీలక అడుగు పడింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన ఈ పరువు హత్య కేసులో పోలీసులు...

నల్గొండలోని మిర్యాలగూడలో గతేడాది జరిగిన ప్రణయ్ హత్య కేసులో కీలక అడుగు పడింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన ఈ పరువు హత్య కేసులో పోలీసులు ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. ఈ కేసును 9 నెలల పాటు సమగ్ర విచారణ జరిపిన పోలీసులు సుమారు 1600 పేజీల ఛార్జిషీట్‌ను నల్గొండ ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానంలో సమర్పించారు.

మిర్యాలగూడ పరువు హత్య కేసులో పోలీసులు ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. ప్రేమ వివాహం చేసుకున్న ప్రణయ్‌ని 2018 సెప్టెంబర్‌ 14న మిర్యాలగూడలోని ప్రభుత్వ ఆస్పత్రి వద్ద కిరాతకంగా హత్య చేశారు. అప్పట్లో ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసును 9 నెలల పాటు దర్యాప్తు చేసిన పోలీసులు సుమారు 1600 పేజీల ఛార్జిషీట్‌ను నల్గొండ ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానంలో సమర్పించారు.

తన కూతురు అమృతవర్షిణిని ప్రేమ వివాహం చేసుకోవడంతో తట్టుకోలేని మారుతీరావు కిరాయి హంతకులతో ప్రణయ్‌ని కడతేర్చాడు. ఇందుకోసం కోట్ల రూపాయలు సుపారీ ఇచ్చాడు. దీంతో అమృత తండ్రి మారుతీరావు, ఆమె బాబాయి శ్రవణ్‌, ఎంఏ కరీం, అస్గర్‌అలీ, అబ్దుల్‌ బారీ, సుభాష్‌ శర్మలను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల బెయిల్‌పై మారుతీరావు, శ్రవణ్‌, కరీం విడుదలయ్యారు. ఇక ఈ ముగ్గురితో పాటు మరో ఐదుగురి పేర్లను కూడా పోలీసులు చార్జిషీటులో చేర్చారు. ఈ కేసు సమగ్ర దర్యాప్తు అనంతరం సాంకేతిక, ఇతర ఆధారాలతో పాటు ఫోరెన్సిక్‌ పరీక్షల నివేదికను మిర్యాలగూడ డిఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు పొందుపరిచారు. అయితే, ప్రణయ్‌ను కిరాతకంగా హత్య చేసిన తన తండ్రి మారుతీరావును బహిరంగంగా ఉరి తీయాలని అమృతవర్షిణి డిమాండ్ చేస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories