ఉద్యోగం పేరుతో వల రూ. 10 లక్షలు పైగా టోకరా!

ఉద్యోగం పేరుతో వల రూ. 10 లక్షలు పైగా టోకరా!
x
Highlights

ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామని ఓ వ్యక్తి దగ్గర ఏకంగా రూ.10.90 లక్షలు తీసుకుని ఉడాయించిన సంఘటన హైదరాబాద్ వెలుగులోకి వచ్చింది. హుమాయున్‌నగర్‌కు చెందిన శ్రీనివాస్‌ ప్రైవేట్‌ ఇంటీరియర్స్‌ కంపెనీలో ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌గా ఆరేళ్లు పనిచేశాడు.

ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు మోసం చేసే కేటుగాళ్లు తయారయ్యారు. ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామని ఓ వ్యక్తి దగ్గర ఏకంగా రూ.10 లక్షలు తీసుకుని ఉడాయించిన సంఘటన హైదరాబాద్ వెలుగులోకి వచ్చింది. హుమాయున్‌నగర్‌కు చెందిన శ్రీనివాస్‌ ప్రైవేట్‌ ఇంటీరియర్స్‌ కంపెనీలో ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌గా ఆరేళ్లు పనిచేశాడు. అనారోగ్యం కారణంతో పాత ఉద్యోగాన్ని మానేశాడు. ఆరోగ్యం కుదుపటడడంతో ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఉద్యోగం కోసం కొన్ని వెబ్ సైట్లో ధరఖాస్తు చేసుకున్నాడు. అయితే లో ఫిబ్రవరి 5వ తేదీన నౌకరీ.కామ్‌ నుంచి ఫోన్‌ చేస్తున్నామంటూ పూజ అనే పేరుతో ఒక మహిళ మాట్లాడింది. టెలీఫోనిక్‌ ఇంటర్వ్యూ ఉంటుందని కొన్ని వివరాలు సేకరించింది.

మరో రెండు ఇంటర్వ్యులు ఉంటాయని చెప్పి ఆమె తప్పుకుంది. ఆ తరువాత టెక్నికల్‌, హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూ అంటూ పట్నాయర్‌ అనే వ్యక్తితో మాట్లాడించింది. మీరు ఇంటర్వ్యూలో ఎంపికయ్యారు, ఎల్‌ అండ్‌ టీ కంపెనీలో సైట్‌ కోఆర్టినేటర్‌ ఉద్యోగమంటూ నమ్మించారు. ఉద్యోగం రావాలంటే రూ.1500లతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించడంతో తక్కువ మొత్తమే కదా అనే ఉద్దేశంతో డబ్బు చెల్లించాడు. రెండు రోజుల తరువాత రూ.80వేలు చెల్లిస్తే ఉద్యోగం వస్తుందని ఒత్తిడి తేవడంతో ఆ డబ్బు చెల్లించాడు. సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.4లక్షలు చెల్లించాలని, ఇదంతా తిరిగి మీరు జాబ్‌లో చేరగానే ఇచ్చేస్తామంటూ నమ్మించడంతో ఆ డబ్బు కూడా చెల్లించాడు. నమ్మకం కుదిరేందుకు ఎల్‌అండ్‌టీ పేరుతో ఉండే ఒక పేపర్‌పై ఉద్యోగానికి ఎంపికైనట్లు లెటర్‌ తయారు చేసి, దానిని ఈ-మెయిల్‌ చేశారు. చెల్లించే ప్రతి పైసా రీఫండ్‌ అవుతుందంటూ నమ్మిస్తూ శ్రీనివాస్‌ వద్ద నుంచి రూ.10.90 లక్షలు వివిధ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌ చేయించారు.

ఇక తీరా పదేపదే డబ్బు చెల్లించాలని అడుగుతుండడంతో మోసం అని గ్రహించిన శ్రీనివాస్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రూ.10.90 లక్షలు పోవడంతో బాధితుడు శ్రీనివాస్ లబోదిబోమంట్టున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories