కాలు బాగుచేయమని వస్తే... చేయి తీశారు విజయవాడ డాక్టర్ల నిర్లక్ష్యం

కాలు బాగుచేయమని వస్తే... చేయి తీశారు విజయవాడ డాక్టర్ల నిర్లక్ష్యం
x
Highlights

విజయవాడలో వైద్యుల నిర్వాకం వలన ఓ వ్యక్తికి అంగవైకల్యం ఏర్పడింది. బాదితుడి కథనం ప్రకారం తూర్పుగోదావరి జిల్లా కొత్తవూడికి చెందిన గుమ్మడి రాజు(27) విజయవాడలోని ఒ బట్టల దుకాణంలో పనిచేస్తున్నాడు. మూడు నెలల క్రితం బైక్ స్టాండ్ కాలికి తగిలి గాయమైంది.

విజయవాడలో వైద్యుల నిర్వాకం వలన ఓ వ్యక్తికి అంగవైకల్యం ఏర్పడింది. బాదితుడి కథనం ప్రకారం తూర్పుగోదావరి జిల్లా కొత్తవూడికి చెందిన గుమ్మడి రాజు(27) విజయవాడలోని ఒ బట్టల దుకాణంలో పనిచేస్తున్నాడు. మూడు నెలల క్రితం బైక్ స్టాండ్ కాలికి తగిలి గాయమైంది. విజయవాడలోని ప్రభుత్వాస్పత్రికి చికిత్స కోసం వెళ్లగా అక్కడి వైద్యుడు కాలు గాయానికి కుట్లు వేసి కట్టు కట్టాడు. ఆస్పత్రి సిబ్బంది అతనికి ఇంజక్షన్లను రెండు చేతులకూ చేశారు. తర్వాత రోజు నుంచి రాజుకు ఒక చేయి పని కదపడానకి వీలులేకుండా పోయింది. దీంతో మళ్లీ ఆస్పత్రికి వచ్చి విషయం చెప్పగా ఎగతాళిగా మాట్లాడి నరాలకు పిండి కట్టుకట్టి పంపించేశారు.

అయితే పిండి కట్టు ఎందుకు కట్టారో తెలియక అనుమానంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి రాజు చూపించాడు. అయితే పరీక్షించిన డాక్టర్ ఇంజక్షన్ సరిగా ఇవ్వకపోవడంతో నరాలకు తగిలి చేయి పనిచేయడం లేదని చెప్పారు. చేయి తిరిగి మాములుగా అయ్యే పరిస్థితి లేదని చెప్పారు. దీంతో బాధితుడు రాజుని తీసుకొని అతని కుటుంబ సభ్యులు ప్రభుత్వాత్రికి వెళ్లీ వైద్యులను నిలదీయగా ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని., ఆరు నెలలు న్యూరాలజీ వైద్యునితో చికిత్స అందిస్తామని అప్పటికి చేయి పనిచేయకపోతే అంగవైకల్య సర్టిఫికెట్ ఇచ్చి లక్షరూపాయి పరిహారం ఇస్తామని తెలిపాడు. బాధితుడు మాత్రం తన చేయిని తిరిగి బాగు చేయాలంటూ ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. దీనిపై కలెక్టర్ ఇంతియాజ్ కు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories