పార్లమెంట్ ముందు వైసీపీ ఎంపీల ఆందోళన

పార్లమెంట్ ముందు వైసీపీ ఎంపీల ఆందోళన
x
Highlights

అటు విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాలపై వైసీపీ పోరాటాన్ని కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీలు పార్లమెంట్‌ గేట్‌-1 దగ్గర నిరసన...

అటు విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాలపై వైసీపీ పోరాటాన్ని కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీలు పార్లమెంట్‌ గేట్‌-1 దగ్గర నిరసన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ ఫ్లకార్డులు ప‍్రదర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రాజెక్ట్‌, విశాఖకు రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలంటూ నినాదాలు చేశారు. కడప స్టీల్‌ ప్లాంట్‌, దుగరాజపట్నం పోర్టుతో పాటు పోలవరం ప్రాజెక్ట్‌ను 2019 కల్లా పూర్తి చేయాలంటూ డిమాండ్‌ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, లోక్‌సభ ఎంపీలు మిథున్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్‌, వైఎస్‌ అవినాష్‌ రెడ్డి పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories