చంద్ర‌బాబు అవినీతిపై వైసీపీ ఎంపీల ఫిర్యాదు

చంద్ర‌బాబు అవినీతిపై వైసీపీ ఎంపీల ఫిర్యాదు
x
Highlights

ఎన్డీఏపై అవిశ్వాసం పెట్ట‌డంతో పార్ల‌మెంట్ స‌మావేశాలు వాడివేడిగా కొన‌సాగుతున్నాయి. వైసీపీ - టీడీపీ లు ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస‌తీర్మానం నాలుగు సార్లు...

ఎన్డీఏపై అవిశ్వాసం పెట్ట‌డంతో పార్ల‌మెంట్ స‌మావేశాలు వాడివేడిగా కొన‌సాగుతున్నాయి. వైసీపీ - టీడీపీ లు ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస‌తీర్మానం నాలుగు సార్లు వీగిపోయింది. దీంతో ఎన్డీఏ అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టాల‌ని కోరుతూ వైసీపీ ఎంపీ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ తో భేటీ అయ్యారు. తాము ప్ర‌వేశ‌పెట్టిన తీర్మానంపై చ‌ర్చ జ‌రిగేలా చొర‌వ చూపాల‌ని కోరారు. అనంత‌రం మీడియాతో మాట్లాడిన వైపీపీ నేత‌లు సీఎం చంద్ర‌బాబుపై మండిప‌డ్డారు.
ఏపీకి టీడీపీ, బీజేపీ తీరని అన్యాయం చేశాయని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు అన్న ద్రోహి చంద్రబాబేనని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు.
చంద్ర‌బాబుకు రాష్ట్ర‌ప్ర‌యోజ‌నాల క‌న్నా పార్టీ ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మ‌నేలా వ్య‌వ‌హ‌రిస్తార‌ని మ‌రో ఎంపీ విజ‌య్ సాయిరెడ్డి మండిప‌డ్డారు. అధికారం కోసం అన్నీ పార్టీల‌తో పొత్తులు పెట్టుకొని రెండు - మూడేళ్లకే ఆ పొత్తులకు గుడ్ బై చెబుతార‌ని అన్నారు. అంతేకాదు చంద్ర‌బాబుకు ఏపీకి ప్ర‌త్యేక‌హోదాపై చిత్త‌శుద్ధిలేద‌ని అన్నారు. తొల‌త వైసీపీ అవిశ్వాసానికి మ‌ద్ద‌తిచ్చిన చంద్ర‌బాబు ..మాట‌మార్చి స్వ‌యంగా తానే ఎన్డీఏపై అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని చెప్ప‌డం ఆయ‌న నిజాయితీకి ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని అన్నారు.అధికారం కోసం అడ్డదారులు తొక్కేందుకు చంద్రబాబు వెనుకాడరని అన్నారు. చంద్రబాబు అవినీతిపై ప్రధానికి ఫిర్యాదు చేశానని విజయసాయి చెప్పారు.
ప్ర‌త్యేక‌హోదా గురించి అసెంబ్లీలో ఇంత‌వ‌ర‌కు మాట‌మాట్లాడ‌ని చంద్ర‌బాబు 2019 ఎన్నిక‌ల కోసం రంగులు మారుస్తున్నార‌ని అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు డ్రామాలు ఆపాలన్నారు.
మేడిపండు ఎలాంటిదో చంద్ర‌బాబు అలాంటివారేన‌ని ఎంపీ అవినాష్ రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబులా తమకు లాలూచీ రాజకీయాలు చేయడం రాదని, నాలుగేళ్లుగా ఒకే మాట మీద ఉన్నామని చెప్పారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం తాము పార్లమెంటు లోపల, బయటా పోరాడుతున్నామని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories