ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌లో వైసీపీ ఎంపీలు

ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌లో వైసీపీ ఎంపీలు
x
Highlights

ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కోసం వైసీపీ అధినేత జ‌గ‌న్ ఎత్తు పై ఎత్తులు వేస్తున్నారు. ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కావాలంటూ ఎన్డీఏ పై అవిశ్వాస తీర్మాన అస్త్రాన్ని...

ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కోసం వైసీపీ అధినేత జ‌గ‌న్ ఎత్తు పై ఎత్తులు వేస్తున్నారు. ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కావాలంటూ ఎన్డీఏ పై అవిశ్వాస తీర్మాన అస్త్రాన్ని ప్ర‌యోగించిన విష‌యం తెలిసిందే. అయితే స‌భ‌లో వైసీపీ పెట్టిన తీర్మానం చ‌ర్చ‌కు రాక‌పోవ‌డంతో జ‌గ‌న్ త‌దుప‌రి భవిష్య‌త్తు కార్య‌చ‌ర‌ణ‌కు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా పార్ల‌మెంట్ స‌మావేశాల ముగింపురోజున‌ వైసీపీ ఎంపీ ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.
అంతేకాదు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో వైసీపీ ఎంపీలు న్యూఢిల్లీలో చేపట్టే దీక్షకు మద్దతుగా రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో దీక్షలు చేపట్టాలని వైసీపీ శ్రేణులను ఆదేశించారు వైఎస్ జగన్. ఈ దీక్షలకు మద్దతివ్వాలని ఆయన ప్రజలను కోరారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నట్టు చంద్రబాబునాయుడు నాటకాలు ఆడుతున్నారని జగన్ విమర్శించారు.
తొల‌త వైసీపీ ఎంపీల రాజీనామాలు స్పీకర్ కార్యాలయంలో సమర్పించిన తర్వాత న్యూఢిల్లీలోనే ఆమరణ నిరహరదీక్షకు దిగనున్నారు. రాష్ట్రంపై త‌మ పార్టీకి ఉన్న చిత్త‌శుద్ధి ఎలా ఉందో ప్ర‌జ‌ల‌కు ప్ర‌జ‌ల‌కు చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు జ‌గ‌న్ .
ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కావాలంటూ కేంద్రంపై వైసీపీ అవిశ్వాస‌న తీర్మానాన్ని ప్ర‌క‌టించింది. ఆ అవిశ్వాస తీర్మానం చ‌ర్చ‌కు రాక‌పోవ‌డంతో వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారు. దీంతో టీడీపీ డైలామాలో ప‌డిపోయింది. వైసీపీ వేస్తున్న ప్ర‌తీ అడుగు టీడీపీపై ఒత్తిడి పెరిగింది. దీంతో త‌మ‌పార్టీకూడా ఎన్డీఏ నుంచి వైదొలిగి, కేంద్రంపై అవిశ్వాసం తీర్మానం పెడుతుంద‌ని సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు.
ఈ తరుణంలో వైసీపీ ఎంపీల ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష మరోసారి చర్చకు దారితీస్తోంది. అదే సమయంలో తాము చేస్తున్న పోరాటంపై ఏపీ లో కూడ చర్చ సాగే అవకాశం ఉందని వైసీపీ భావిస్తోంది. రాజకీయంగా ఈ నిర్ణయం తమకు కలిసివస్తోందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories