జ‌గ‌న్ పై అభ్యంత‌ర కర‌ంగా పోస్ట్..పోలీసుల‌కు ఫిర్యాదు

జ‌గ‌న్ పై అభ్యంత‌ర కర‌ంగా పోస్ట్..పోలీసుల‌కు ఫిర్యాదు
x
Highlights

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ పై సోష‌ల్ మీడియాలో అభ్యంత‌ర‌కంగా పోస్ట్ పెట్టినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో స‌మాచారం అందుకున్న వైసీపీ నేత‌లు స‌ద‌రు...

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ పై సోష‌ల్ మీడియాలో అభ్యంత‌ర‌కంగా పోస్ట్ పెట్టినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో స‌మాచారం అందుకున్న వైసీపీ నేత‌లు స‌ద‌రు పోస్ట్ చేసిన వ్య‌క్తిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల క్రితం కృష్ణా జిల్లా మొవ్వ మండలం కోసూరుకు చెందిన పరుచూరి సురేష్ కుమార్ ఫేస్‌బుక్‌లో అసభ్యకరంగా పోస్టు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ పోస్ట్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన పామర్రు వైసీపీ ఇంచార్జ్ అనిల్ కుమార్, మ‌రికొంత‌మంది వైసీపీ నేత‌లు కూచిపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

అయితే ఫిర్యాదు చేయ‌డానికి వ‌చ్చిన త‌మ‌పై పోలీసులు అమ‌ర్యాద‌గా ప్ర‌వ‌ర్తించార‌ని వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. పార్టీ లెటర్ హెడ్‌పై ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు తీసుకోకుండా, అడ్రస్ చెప్పాలని , పబ్లిక్‌గా పెట్టిన పోస్టు నీకు వచ్చిందా అని ప్ర‌శ్నించార‌ని వైసీపీ నేత‌లు కూచిపూడి - మొవ్వ రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు. ఈ రాస్తో రోకో పై సీఐ జనార్ధన్ రావు జోక్యం చేసుకొని ఫిర్యాదును స్వీకరించి, దర్యాఫ్తు చేస్తామని హామీ ఇచ్చారు. జ‌గ‌న్ గురించి అభ్యంత‌క‌రంగా పోస్ట్ చేసిన వారిని అరెస్ట్ చేస్తామ‌ని అన్నారు. దీంతో వైసీపీ కేడర్ ఆందోళనను విరమించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories