హైదరాబాద్‌లో రెచ్చిపోతున్న యువత : జైలు ఊచలు..

హైదరాబాద్‌లో రెచ్చిపోతున్న యువత : జైలు ఊచలు..
x
Highlights

హైదరాబాద్ నగరంలో రోజురోజుకు యువకుల వెకిలి వేషాలు పెచ్చుమీరుతున్నాయి. అడుగడుగునా చెక్‌పోస్టులు ఉన్నా.. పోలీసుల కంటపడకుండా ఆ సందుల్లోంచి, ఈ సందుల్లోంచి...

హైదరాబాద్ నగరంలో రోజురోజుకు యువకుల వెకిలి వేషాలు పెచ్చుమీరుతున్నాయి. అడుగడుగునా చెక్‌పోస్టులు ఉన్నా.. పోలీసుల కంటపడకుండా ఆ సందుల్లోంచి, ఈ సందుల్లోంచి మళ్లీ మళ్లీ మెయిన్‌రోడ్లపైకి వస్తూ బైక్‌లపై స్టంట్లు చేశారు ఈ కుర్రాళ్లు. ముందుచక్రం గాల్లో లేపి డ్రైవ్ చేస్తూ ఒళ్లుగగుర్పొడిచేలా ఫీట్లు చేస్తున్నారు. పాతికేళ్ళు కూడా నిండని కుర్రాళ్లు ఇలా అర్థరాత్రిళ్లు రోడ్లపైకి వచ్చి ఈ ఫీట్లు చేస్తుండడంతో మిగతా వాళ్ళు టెన్షన్ తో ఇబ్బందిపడ్డారు. అయితే ఇదేం కొత్త కాకపోయినా.. ఇలా ప్రవర్తించే కుర్రాళ్లను పట్టుకుని కౌన్సెలింగ్ ఇస్తున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. అయినా వారిలో మార్పు రాకపోవడంతో వారి తల్లిదండ్రుల్ని కూడా పిలిచి మాట్లాడుతున్నారు. ఇలా అతి చేస్తూ పోతే వారి ప్రాణానికే కాకుండా పక్కవాళ్ళ ప్రాణాలకు సైతం ముప్పు పొంచి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. రెగ్యులర్‌గా స్పెషల్ కౌన్సెలింగ్ లు జరుగుతూనే ఉన్నా కుర్రాళ్లలో మార్పు మాత్రం రావడం లేదు. దాంతో ఇకపై ఈ తరహా ఫీట్లు చేస్తే సీరియస్‌గా తీసుకుంటామని, నిబంధనలు ఉల్లంగిస్తే జైలు ఊచలు లెక్కపెట్టాల్సివస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories