చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకొని పోతుంది మోడీ

చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకొని పోతుంది మోడీ
x
Highlights

మాల్యా వార‌సుడు డైమండ్ వ్యాపారి నీర‌వ్ మోడీ పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకులో 11000కోట్ల‌ను ముంచేసి ద‌ర్జాగా విదేశాల‌కు చెక్కేసిన విష‌యం తెలిసిందే. దీంతో మోడీ...

మాల్యా వార‌సుడు డైమండ్ వ్యాపారి నీర‌వ్ మోడీ పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకులో 11000కోట్ల‌ను ముంచేసి ద‌ర్జాగా విదేశాల‌కు చెక్కేసిన విష‌యం తెలిసిందే. దీంతో మోడీ కుంభ‌కోణం ఇలా చేశాడు. ఆ బ్యాంకును అలా ముంచాడు. ఈ బ్యాంకులో ఇంత తిన్నాడు. అంటూ నెట్టింట్లో ప్ర‌చారం జోరందుకుంది. అయితే వేల‌కోట్లు అప్ప‌నంగా తిన్న‌ది కాకుండా రివ‌ర్స్ లో బ్యాంకర్ల‌పై కౌంట‌ర్ అటాక్ కు దిగాడు. మీ వ‌ల్ల నాపేరు ప్ర‌తిష్ట‌లు దెబ్బ‌తిన్నాయి. దీంతో మీరు నా నుంచి రిక‌వరీ చేసుకునే అదృష్టాన్ని కోల్పోయారు.

మీ ప్ర‌చారం వ‌ల్ల వ‌ర‌ల్డ్ వైడ్ గా నా ప‌రువు గంగ‌లో క‌లిసింది. దాని ప్ర‌భావం నా బిజినెస్ ల‌పై ప‌డి ఆర్ధికంగా న‌ష్ట‌పోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చిందంటూ లేఖ‌లు సంధించాడు. ఈ కుంభ‌కోణంలో నా త‌ప్పేమీ లేదు. మీరు అత్యాత్సాహంతో ప‌నిచేశారు. ఇదంతా మీవ‌ల్లే ద‌య‌చేసి నన్ను త‌ప్ప‌ప‌ట్ట‌కండి అని స్వహ‌స్త్రాల‌తో లేఖ‌లో పేర్కొన్నాడు. మ‌రి ప్ర‌జాస్వామ్య‌మైన దేశంలో ఓ చ‌ట్టం ఉంది. ఇలా కుంభ‌కోణాలు చేసి దేశాలు ప‌ట్టుకొని తిరుగుతుంటే ఊరుకుంటుందా. ఊరుకోదు. ఎన్నికోట్లు టోక‌రా వేశారో అన్నీంటిని ముక్కుపిండి వ‌సూలు చేస్తుంది.

అలా ఇప్ప‌టి వ‌ర‌కు రూ.30కోట్ల ఖ‌రీదైన గ‌డియారాల్ని , 14కోట్ల షేర్ల‌ను , 3వేల కోట్ల ఆస్తుల్ని, 9 ల‌గ్జ‌రీ కార్ల‌ను అటాచ్ చేసుకొని చ‌ట్టం త‌న‌ప‌ని తాను చేసుకుంటూ వెళుతుంది. అంతేకాదు నీరవ్‌ ను భారత్‌ కు రప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories