కూకట్‌పల్లి బరిలో ఏలూరి..?

కూకట్‌పల్లి బరిలో ఏలూరి..?
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు. హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి,...

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు. హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో ఆంధ్రప్రాంత ఓటర్లు అధికంగా ఉన్నారు. దాంతో ఈ సీట్లలో పోటీ చేసేందుకు ఆంధ్ర నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో ఏపీకాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి కూడా కూకట్‌పల్లి నుంచి బరిలోకి దిగాలని అనుకుంటున్నారు. ఇప్పటికే తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరుతూ కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిశారు. రాహుల్ గాంధీకి సన్నిహితంగా మెలిగిన అయన 2014 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గంనుంచి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. ఆ తరువాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం పోటీ చేసి గౌరవప్రద ఓట్లను సాధించారు. తాజాగా కూకట్‌పల్లి నుంచి పోటీ చెయ్యాలని నిర్ణయించుకున్న ఏలూరి కచ్చితంగా తనకే టికెట్ వస్తుందని ఆశిస్తున్నారు. మరోవైపు ఇదే నియోజకవర్గం టికెట్ కోసం మహాకూటమి తరుపున విశ్వప్రయత్నాలు చేస్తున్నారు టీడీపీ సీనియర్ నేత ఇనగాల పెద్దిరెడ్డి. అయితే సిటీలోని కొన్ని నియోజకవర్గాల్లో సెటిలర్స్ కె టికెట్ ఇవ్వాలని పీసీసీకి సూచిస్తున్నారట రాహుల్ గాంధీ. అందులో భాగంగా పైన పేర్కొన్న మూడు నియోజకవర్గాలను సెటిలర్స్ కు, అదికూడా కాంగ్రెస్ నేతలకే ఉండాలని ఆదేశించారట. దాంతో ఏలూరి రామచంద్రారెడ్డి ఈ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ నేతగా, పారిశ్రామిక వేత్తగా కూకట్‌పల్లి ప్రజలకు అయన సుపరిచితమే. కాగా మహాకూటమి టికెట్ ఏలూరి దక్కుతుందా లేక పెద్దిరెడ్డికా..? ఇద్దరు కాకుండా మరోనేత సీన్ లోకి వస్తారా అన్న విషయం తెలియాలంటే రెండు మూడు రోజులు ఆగాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories