చంద్ర‌బాబుకు షాక్ ..వైసీపీలోకి య‌ల‌మంచిలి..?

చంద్ర‌బాబుకు షాక్ ..వైసీపీలోకి య‌ల‌మంచిలి..?
x
Highlights

2014 నుంచి ఏపీ అధికార పార్టీ టీడీపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ మొద‌లు పెట్టింది. దీంతో వైసీపీకి చెందిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు టీడీపీలో...

2014 నుంచి ఏపీ అధికార పార్టీ టీడీపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ మొద‌లు పెట్టింది. దీంతో వైసీపీకి చెందిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు టీడీపీలో చేరారు. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో నియోజ‌క‌వ‌ర్గాల పెర‌గ‌కుంటే టీడీపీ ఆప‌రేష‌న్ విక‌ర్ష్ త‌ప్ప‌ద‌ని పొలిటిక‌ల్ పండితులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.
ఈనేప‌థ్యంలో నియోజ‌క‌వ‌ర్గాల పెంపుదల‌ని అస్త్రంగా చేసుకున్న వైసీపీ అధినేత జ‌గ‌న్ టీడీపీ నేత‌ల్ని టార్గెట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే య‌ల‌మంచిలి ర‌వి వైసీపీ లో చేర‌నున్న‌ట్లు తెలుస్తోంది. గ‌త కొద్దిరోజులుగా య‌ల‌మంచిలి వైసీపీ లో చేరుతార‌ని ప్ర‌చారం జ‌రిగింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన చంద్ర‌బాబు య‌ల‌మంచిలిని బుజ్జ‌గించే ప్ర‌య‌త్నం చేశారు. కానీ ఆ ప్ర‌య‌త్నాల‌న్నీ విఫ‌ల‌మ‌య్యాయి.
ప్ర‌స్తుతం వైఎస్ జ‌గ‌న్ త‌ల‌పెట్టిన ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర గుంటూరులో కొన‌సాగుతుంది. పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ తో య‌ల‌మంచిలి భేటీ కానున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. జ‌గ‌న్ పాద‌యాత్ర గుంటూరులో కొన‌సాగుతుండ‌గా
నాలుగైదు రోజుల్లో ఈ యాత్ర విజయవాడలో అడుగుపెట్టనుంది. అదే రోజు యలమంచిలి రవి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇది టీడీపీకి గట్టి దెబ్బే. ఎన్నికలకు ఏడాది ముందు ఈ పరిణామాలు ఆ పార్టీ స్థైర్యాన్ని దెబ్బతీస్తాయని అంటున్నారు.
కాగా, 2014 నుంచి టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించింది. ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల సమయంలో నియోజకవర్గాల సంఖ్య పెరుగుతాయని భావించి టీడీపీ వారిని చేర్చుకున్నట్లుగా భావిస్తారు. ఇప్పుడు నియోజకవర్గాల సంఖ్య పెరగకుంటే టీడీపీకి ఆపరేషన్ వికర్ష తప్పదని అంటున్నారు. ప్రధానంగా జనసేన పార్టీ, వైసీపీ నుంచి దెబ్బ ఉంటుందని అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories