శబరిమలలో 10 లక్షల మంది మహిళలతో ఉమెన్స్‌‌ వాల్‌

శబరిమలలో 10 లక్షల మంది మహిళలతో ఉమెన్స్‌‌ వాల్‌
x
Highlights

ప్రఖ్యాత అయ్యప్ప పుణ్యక్షేత్రం శబరిమల దర్శనానికి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు అమలు కోసం కేరళ...

ప్రఖ్యాత అయ్యప్ప పుణ్యక్షేత్రం శబరిమల దర్శనానికి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు అమలు కోసం కేరళ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందుకోసం పలువురు మద్దతు కోరుతోంది. ఇందులో భాగంగా కాసర్గోడే నుంచి రాష్ట్ర రాజధాని తిరువనంతపురం వరకు పదిలక్షలమంది మహిళలతో ఉమెన్స్‌‌ వాల్‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే రాజకీయ పార్టీలు కూడా తమతమ మహిళా కార్యకర్తలను ఈ కార్యక్రమానికి పంపవచ్చని సీఎం పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి తమవంతు మద్దతిస్తామని కొన్ని సంస్థలు ప్రకటించాయి, 'ప్రజలను మూఢనమ్మకాల నుంచి కాపాడటానికి, స్త్రీలను సమానత్వం దృష్టితో చూడటానికి ‘మిలియన్‌ ఉమెన్స్‌‌ వాల్' ను ఏర్పాటు చేశాం. జనవరి ఒకటవ తేదీ ఇందుకు శ్రీకారం చుట్టాం. 600కి.మీమేర ఈ వాల్‌ను ఏర్పాటు చేస్తాం. రండి..మీ వంతు మద్దతివ్వండి.' అని రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్‌ ఐజాక్‌ ట్వీట్‌ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories