పదిహేనేళ్ల ప్రేమను మృత్యువు కాటేసింది.. కవలలకు జన్మనిచ్చి..

పదిహేనేళ్ల ప్రేమను మృత్యువు కాటేసింది.. కవలలకు జన్మనిచ్చి..
x
Highlights

ఈ ఫొటోలో కనిపిస్తున్న ఈ జంట.. పదిహేనేళ్లుగా ప్రేమించుకుంది. కులాలు అడ్డు కావడంతో వీరి ప్రేమకు పెద్దలు అడ్డు చెప్పారు. అయితేనేం సన్నిహితులు,...

ఈ ఫొటోలో కనిపిస్తున్న ఈ జంట.. పదిహేనేళ్లుగా ప్రేమించుకుంది. కులాలు అడ్డు కావడంతో వీరి ప్రేమకు పెద్దలు అడ్డు చెప్పారు. అయితేనేం సన్నిహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో గతేడాది ఒక్కటయ్యారు. వారి దాంపత్య జీవితానికి మధుర క్షణం ఆమె గర్భం దాల్చడం. కడుపులో ఉన్నది ఒకరు కాదు ఇద్దరని వైద్యులు చెబితే సంబరపడ్డారు. కానీ మృత్యువు వారి సంతోషాన్ని కాటేసింది. ఇద్దరు కవలలకు జన్మనిచ్చి వారిని చూడకుండానే ఆ తల్లి కన్నుమూసింది. ఈ హృదయ విదారక ఘటన హైదరాబాద్ లో జరిగింది.

బండ్లగూడ సమీపం శ్రీఇంద్రప్రస్థకాలనీకి చెందిన పంగులూరి రాకేష్‌ అదే కాలనీకి చెందిన షకీరా బేగం(39)లు చదువుకునే రోజులనుంచి ప్రేమికులు. మతాలు వేరు కావడంతో ఇరు కుటుంబాల వారు వీరిపెళ్లికి ఒప్పుకోలేదు. పైగా వారి ప్రేమను మరిపించేందుకు షకీరా కుటుంబ సభ్యులు ఉప్పల్‌కు తమ నివాసాన్ని మార్చారు. అయినా 15 ఏళ్ల పాటు వారి ప్రేమలో ఎటువంటి మార్పు లేదు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం . దాంతో గతేడాది డిసెంబర్ 3 న వీరు పెళ్లి చేసుకున్నారు. షకీరా గర్భం దాల్చిన తర్వాత ఫైనాన్స్‌ సంస్థలో మేనేజర్‌గా పనిచేసిన రాకేష్‌ ఆమె చూసుకోవడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేశాడు. కొన్ని నెలల తర్వాత వైద్యులు కవల పిల్లలు పుట్టబోతున్నారని వైద్యులు దంపతులకు చెప్పారు. దాంతో వారి సంతోషానికి అవధుల్లేవు.. ఇటీవల ఆమెకు ఎనిమిదో నెల నడుస్తుండగా ఒంట్లో పురిటినొప్పులు రావడంతో గురువారం ఆసుపత్రికి తీసుకెళ్లారు. శుక్రవారం ఉదయం ఆమె ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా ఉందని అత్యవసరంగా శస్త్ర చికిత్స చేశారు. ఇద్దరు కవలల(ఆడ పిల్లల)కు జన్మనిచ్చింది. అదే రోజు రాత్రి 8.30 గంటల సమయంలో గుండెపోటుతో మృతిచెందిందని వైద్యులు తెలిపారు. దాంతో కుటుంబసభ్యులు అందరూ ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్య ఇక లేదని రాకేష్ గుండెలవిసేలా రోధించారు. ఈ ఘటన చూసిన ప్రతిఒక్కరు కన్నీరు కార్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories