శర్మకి, కాంగ్రెస్‌కు లింకేంటి.? ఆ ట్రావెల్స్‌నే ఎందుకు ఎంచుకున్నారు

శర్మకి, కాంగ్రెస్‌కు లింకేంటి.? ఆ ట్రావెల్స్‌నే ఎందుకు ఎంచుకున్నారు
x
Highlights

కన్నడ రాజకీయాలలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి వరకూ బెంగళూరు వేదికగా నడిచిన కర్ణాటక ఎన్నికల రాజకీయం నేడు హైదరాబాద్‌కు చేరుకుంది. తమ...

కన్నడ రాజకీయాలలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి వరకూ బెంగళూరు వేదికగా నడిచిన కర్ణాటక ఎన్నికల రాజకీయం నేడు హైదరాబాద్‌కు చేరుకుంది. తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌-జేడీఎస్‌ శర్మ ట్రావెల్స్‌కు చెందిన మూడు బస్సుల్లో హైదరాబాద్‌కు తీసుకొచ్చింది.

తొలుత కేరళలోని కొచ్చిన్‌కు ఎమ్మెల్యేలను తరలించాలని భావించినా.. ప్రత్యేక విమానానికి అనుమతి దొరకలేదు. దీంతో కర్నూలు గుండా ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించారు. అయితే, ఎమ్మెల్యేల తరలింపు విషయంలో ఓ ట్రావెల్స్‌ ప్రముఖ పాత్రను పోషించింది. ఎమ్మెల్యేలకు శర్మ ట్రావెల్స్‌ లగ్జరీ బస్సులను ఏర్పాటు చేసింది. శర్మ ట్రావెల్స్‌ యజమాని డీపీ శర్మ కాంగ్రెస్‌ పార్టీకి అత్యంత నమ్మకస్తుడు. రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన శర్మ 1980ల్లోనే బెంగళూరుకు వలస వచ్చారు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో అభివృద్ధి చెందిన ఆయనకు కాంగ్రెస్‌ పార్టీ నేతలతో సంబంధాలు ఏర్పడ్డాయి.

1998లో దక్షిణ బెంగళూరు నుంచి ఎంపీగా శర్మ పోటీ చేశారు. అయితే, అనంత్‌కుమార్‌పై లక్షన్నర ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ ప్రధానమంత్రులు ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ, పీవీ నరసింహారావులతో శర్మకు సత్సంబందాలు ఉండేవి. 2001లో శర్మ చనిపోయారు. శర్మ స్థాపించిన బస్సు సర్వీసులు, కార్గో సర్వీసులు ఇంకా కొనసాగుతున్నాయి. భారత్‌లో లెక్సియా, వోల్వో బస్సు సర్వీసులను పరిచయం చేసింది కూడా ఈ ట్రావెల్సే.

Show Full Article
Print Article
Next Story
More Stories