వాట్సాప్ లో స‌రికొత్త ఫీచ‌ర్

వాట్సాప్ లో స‌రికొత్త ఫీచ‌ర్
x
Highlights

వాట్సాప్‌లో మరో అడుగుముందుకేసింది. సాధార‌ణంగా వాట్సాప్ గ్రూప్ లో ఉన్న అడ్మిన్ ను తొల‌గించాలంటే వారు సంబంధిత గ్రూప్ ను బ‌య‌ట‌కు రావాల్సి ఉంది. అయితే...

వాట్సాప్‌లో మరో అడుగుముందుకేసింది. సాధార‌ణంగా వాట్సాప్ గ్రూప్ లో ఉన్న అడ్మిన్ ను తొల‌గించాలంటే వారు సంబంధిత గ్రూప్ ను బ‌య‌ట‌కు రావాల్సి ఉంది. అయితే త్వ‌ర‌లో వాట్సాప్ కొత్త ఫీచ‌ర్ తో ఆ స‌మ‌స్య ఉండ‌ద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతానికి ఆండ్రాయిడ్, ఐవోఎస్ లో ఈ ఫీచ‌ర్ ప‌రీక్ష ద‌శ‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌స్తే అడ్మిన్ ను తొల‌గించేందుకు వీలుగా ‘డిస్మిస్‌’ బటన్‌ను వాట్సాప్‌ కొత్తగా తీసుకురాబోతోంది.

వీటితో పాటు గ్రూప్ లో వీడియోలు, మెసేజ్, షేరింగ్ వాయిస్ మెసేజ్ ల‌ను క‌ట్ట‌డి చేసే అవ‌కాశం ఒక్క అడ్మిన్ కు ఉంది. త్వ‌ర‌లో రానున్న కొత్త ఫీచ‌ర్ కు అడ్మిన్ తో పాటు గ్రూప్ లో ఉన్న‌వారు ఎవ‌రైనా పై వాటిని నియంత్రిచ‌వ‌చ్చు. ఈ స‌దుపాయాన్నియాడ్ చేస్తున్న‌ట్లు ఆ సంస్థ ప్ర‌తినిధులు వివ‌రించారు. ఎవరైనా సభ్యడు ఇవి చేయాలంటే అడ్మిన్‌ అనుమతి తప్పనిసరి.

Show Full Article
Print Article
Next Story
More Stories