వాట్సాప్ తో డిజిటల్ పేమెంట్స్

వాట్సాప్ తో డిజిటల్ పేమెంట్స్
x
Highlights

దేశ‌వ్యాప్తంగా 100కోట్ల‌కు పైగా వినియోగ‌దారుల్ని సొంతం చేసుకున్న వాట్సాప్ స‌రికొత్త సంచ‌ల‌నం సృష్టించ‌నుంది. ఈ యాప్ మార్కెట్లో లాంచ్ అయిన నాటి నుంచి...

దేశ‌వ్యాప్తంగా 100కోట్ల‌కు పైగా వినియోగ‌దారుల్ని సొంతం చేసుకున్న వాట్సాప్ స‌రికొత్త సంచ‌ల‌నం సృష్టించ‌నుంది. ఈ యాప్ మార్కెట్లో లాంచ్ అయిన నాటి నుంచి ఇప్పటి వరకు అనేక విప్లవాత్మక మార్పులు చోటుచేసుకన్నాయి. ఈ నేప‌థ్యంలో వాట్సాప్ ద్వారా బ్యాంక్ ట్రాన్సాక్ష‌న్స్ చేసుకునే అవ‌కాశం క‌ల‌గ‌నుంది. గ‌తంలో ఈ యాప్ యాజ‌మాన్యం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంట‌ర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా చెల్లింపులు చేసుకునే స‌దుపాయం క‌ల్పించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన తెలిసిందే. అందులో భాగంగా ఇప్ప‌టికే యూపీఐ చెల్లింపుల కోసం వాట్సాప్ ప‌లు బ్యాంకుల‌తో ఒప్పందాలు కుర్చుకుంది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌లతో ఒప్పందాలు కూడా పూర్తయిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతానికి ఇంటిగ్రేష‌న్ ప్ర‌క్రియ‌లో భాగంగా డేటా భద్రతపై బ్యాంకులు సెక్యూరిటీ చెక్స్‌ నిర్వహిస్తున్నాయ‌ని బ్యాంకు అధికారులు తెలిపారు. ఈ స‌దుపాయం అందుబాటులోకి వ‌స్తే డిజిట‌ల్ పేమెంట్స్ పై స‌న్నాహాలు చేస్తున్న వాట్సాప్ ఈ ప్ర‌క్రియ ఫిబ్ర‌వ‌రి నెలాఖ‌రులోగా అందరికీ అందుబాటులోకి తీసుకువ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories