శీఘ్ర‌మేవ క‌ల్యాణ‌ ప్రాప్తిర‌స్తు

శీఘ్ర‌మేవ క‌ల్యాణ‌ ప్రాప్తిర‌స్తు
x
Highlights

నాటిత‌రం హీరోల నుంచి నేటి త‌రం హీరోలతో పోటీ ప‌డుతున్న హీరో త‌రుణ్ త్వ‌ర‌లో పెళ్లి పీఠ‌లెక్క‌నున్న‌ట్లు స‌మాచారం. గ‌తంలో త‌రుణ్ పెళ్లి కావాల్సి ఉండ‌గా...

నాటిత‌రం హీరోల నుంచి నేటి త‌రం హీరోలతో పోటీ ప‌డుతున్న హీరో త‌రుణ్ త్వ‌ర‌లో పెళ్లి పీఠ‌లెక్క‌నున్న‌ట్లు స‌మాచారం. గ‌తంలో త‌రుణ్ పెళ్లి కావాల్సి ఉండ‌గా కొన్ని అన్వేక కార‌ణాల‌తో పెళ్లిఊసెత్త‌లేదు. అయితే అమ్మ కోరిక మేర‌కు త‌రుణ్ ఈ ఏడాది పెళ్లి చేసుకోకున్నాడు.
‘ఆదిత్య 369’, ‘అంజలి’, ‘మనసు మమత’ ‘శత్రువు’ వంటి సినిమాల్లో బాల‌న‌టుడిగా మెప్పించిన త‌రుణ్ 2000లో ‘నువ్వే కావాలి’ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. నువ్వేకావాలితో ల‌వర్ బాయ్ అనిపించుకున్న త‌రుణ్ వ‌రుస ప్రేమ‌కథల‌తో అభిమానుల్ని మెప్పించారు. ప్ర‌స్తుతం ఈ ల‌వ‌ర్ బాయ్ ర‌మేష్ గోపి ద‌ర్శ‌క‌త్వంలో ‘ఇది నా లవ్‌స్టోరీ’ అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న సినిమాను విడుదల చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories