పవన్ కల్యాణ్ అప్పుడు రావాల్సి వస్తుంది నా కాళ్ల దగ్గరికి

Highlights

మ‌రోసారి ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌కు , క‌త్తిమ‌హేష్ ల మ‌ధ్య మాట‌ల యుద్ధం మొద‌లైంది. ఓ మీడియా డిబెట్లో పాల్గొన్న మ‌హేష్ ను ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు...

మ‌రోసారి ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌కు , క‌త్తిమ‌హేష్ ల మ‌ధ్య మాట‌ల యుద్ధం మొద‌లైంది. ఓ మీడియా డిబెట్లో పాల్గొన్న మ‌హేష్ ను ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. దీంతో చిర్ర‌త్తిపోయిన మ‌షేష్ తాను ఒక్క‌సారే ప‌వ‌న్ క‌ల్యాణ్ ను సారీ చెప్ప‌మ‌న్నా ...ఇప్పుడు అదీలేదు ప‌వ‌న్ ఒక్క‌ట్వీట్ చేస్తే చాలు అని చెప్పుకొచ్చారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ను వ్య‌క్తిగ‌తంగా వ్య‌తిరేకించ‌లేదు. కానీ ప‌వ‌న్ అభిమానులు మాత్రం అబ్యూస్ చేసేలా బూతులు తిడుతున్నార‌ని వాపోయాడు. నా అభిప్రాయాన్ని బయటికి చెప్పడానికి కానీ, నా ప్రతి కదలిక మీద, మా ఇంటి వారి వరకు వెళ్లి కామెంట్స్ చేస్తున్నారు వీళ్లు. దీనిని దాడి కాదంటారా? ఇప్పుడు నన్ను మెట్టు దిగమంటారా? ఎందుకు దిగాలి నేను మెట్టు? ఇలాంటి అభిమానులు, కార్యకర్తలు ఉంటే.. ఆ పార్టీ నాశనం అవడానికి, ఆ హీరో నాశనం అవడానికి కార్యకర్తలే కారకులవుతున్నారు. అంతకుమించి ఇంకేమీ లేదు.
ప్రజాస్వామ్యంలో హక్కుల్ని కాలరాస్తున్నారా? ఒకవేళ నేనే కనుక రోడ్డు మీదకి దిగితే.. నా వైపు ప్రజాస్వామిక సంఘాలు ఉంటాయి, మైనారిటీ సంఘాలు ఉంటాయి. పవన్ కల్యాణ్ అప్పుడు రావాల్సి వస్తుంది నా కాళ్ల దగ్గరికి. జాగ్రత్తగా ఉండండి.. అనవసరంగా మీరు విషయాన్ని పెద్దది చేసుకుంటూ వెళ్లకండి. మీకే నష్టం జరుగుతుంది.. అంటూ కత్తి మహేష్ అల్టిమేటం జారీ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories