పవన్‌కల్యాణ్‌కు ఓ చిన్న విన్నపం

పవన్‌కల్యాణ్‌కు ఓ చిన్న విన్నపం
x
Highlights

సాయిధరమ్‌తేజ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఇంటిలిజెంట్‌’. లావణ్య త్రిపాఠి కథానాయిక. వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహించారు. సీకే ఎంటర్‌టైన్‌మెంట్‌...

సాయిధరమ్‌తేజ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఇంటిలిజెంట్‌’. లావణ్య త్రిపాఠి కథానాయిక. వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహించారు. సీకే ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సి.కల్యాణ్‌ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆదివారం రాజమహేంద్రవరంలో ప్రీరిలీజ్‌ వేడుక ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా దర్శకుడు వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ వేదికపై నుంచి పవన్‌కల్యాణ్‌గారికి నాదో చిన్న విన్నపం. ‘సినిమాల్లో నటించను’ అన్నారు. సమస్యలపై ఎంత పోరాడినా, రాజకీయంగా ఎంత ఎదిగినా, మీకు సమయం దొరికినప్పుడల్లా ఈ అభిమానుల కోసం సినిమా చేయండి ప్లీజ్‌. సి.కల్యాణ్‌తో ఒక సోదరుడిలా కలిసి పనిచేశా. సినిమా కోసం ఆయన ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. సినిమా కోసం కష్టపడిన వారందరికీ ధన్యవాదాలు. తేజూకు తన స్టైల్‌ తనకున్నా.. ‘ఛమకు ఛమకు ఛాం’ చేస్తుంటే అన్నయ్య చిరంజీవే గుర్తొచ్చారు. కావాలని రెండు, మూడు షాట్లు పవన్‌కల్యాణ్‌ గుర్తొచ్చేలా తీశాను. వాళ్లిద్దరూ కలిస్తే ఎలా ఉంటుందో తేజూలో కనిపిస్తుంది. చిరంజీవిగారిలా పెద్ద స్టార్‌ అవుతాడు. నేను సహాయ దర్శకుడిగా ఉన్నప్పుడు నేను పెద్ద డైరెక్టర్‌ అవుతానని నమ్మినవాళ్లలో సి.కల్యాణ్‌ ఒకరు. నా గురువు సాగర్‌గారు ఇచ్చిన ప్రోత్సాహంతో మేము ఇక్కడ ఉన్నాం.’’ అని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories