ప్రేమలో శృంగారం కోరుకునేది అమ్మాయిలే ఎక్కువంట

ప్రేమలో శృంగారం కోరుకునేది అమ్మాయిలే ఎక్కువంట
x
Highlights

యావరేజ్ అబ్బాయిలంటేనే..అమ్మాయిలకు మోజు యువకులు అందంగా ఉంటే అమ్మాయిలు పడిపోతారా..? అనే ప్రశ్నపై ఓ సంస్థ సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో పలు...

యావరేజ్ అబ్బాయిలంటేనే..అమ్మాయిలకు మోజు
యువకులు అందంగా ఉంటే అమ్మాయిలు పడిపోతారా..? అనే ప్రశ్నపై ఓ సంస్థ సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అబ్బాయిలు అమ్మాయిల్ని ఆకర్షించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. హ్యాండ్ సమ్ గా తయారవ్వడం. గంటల కొద్ది జిమ్ అని, సిక్స్ ప్యాక్ లు అంటూ గడిపేస్తుంటారు. అలా చేస్తే అమ్మాయిల్ని ఆకర్షించొచ్చా అంటే అదేంలేదని కొన్ని అధ్యయనాలు కొట్టిపారేస్తున్నాయి. దాదాపు 100కు 40 శాతం మంది అమ్మాయిలు...యావరేజ్ గా ఉన్న అబ్బాయిల్ని ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఏడు శాతం అమ్మాయిలు మాత్రమే హ్యాండ్ సమ్ గా ఉండే అబ్బాయిల్ని ఇష్టపడుతున్నట్లు వెల్లడైంది. ఇలా ఎందుకని అంటే హాండ్ సమ్ గా ఉండే కుర్రాళ్లు కష్టాలకు కుంగిపోతారని, యావరేజ్ గా ఉండే అబ్బాయిలు ఎలాంటి కష్టాన్నైన్నా ఎదుర్కొని అనుకున్న పనిని పూర్తి చేస్తారని అంటున్నారు. ఆకర్షణ విషయంలో పార్టనర్ తమను డామినేట్ చేయొద్దని సగం మంది అమ్మాయిలు భావిస్తారట. ఒకవేళ డామినేట్ చేస్తే అమ్మాయిలకు అభద్రత కు గురవ్వడం ఖాయం. కాబట్టి అమ్మాయిల విషయంలో అబ్బాయిలు యావరేజ్ గా ఉంటే ప్లస్ అవుతుందన్నమాట.

ప్రేమలో శృంగారం కోరుకునేది అమ్మాయిలే ఎక్కువంట
వోచర్ కోడ్స్ ప్రో అనే అధ్యయన సంస్థ ప్రేమలో సెక్స్‌ను కోరుకునేది ఆడా? మగా? అనే విషయం పై పరిశోదనలు జరిపింది. ఈ పరిశోదనల్లో 59శాతం మంది అమ్మాయిలు ప్రేమలో ఉన్నప్పుడు శృంగారం కోసం తెగ ఆరాటపడిపోతారని నిర్ధారణకు వచ్చారు. బ్రిటన్ కేంద్రంగా 18ఏళ్లపైబడిన ప్రేమజంటల్ని ప్రశ్నిస్తే మగవారికంటే ఆడవారికి శృంగారం చేయాలని బలంగా ఉంటుందట. ఇక మగవారి విషయంలో 41శాతం మంది ప్రేమ బంధంతో పడక సుఖం కోరుకుంటారట. శృంగారం కోసం మగవాళ్లు పడి చచ్చిపోతారనే అభిప్రాయానికి విరుద్దంగా .. ప్రేమ, సాన్నిహిత్యంలో.. సెక్స్ పట్ల ఆడవాళ్లకే ఆసక్తి ఎక్కువ అని ఈ అధ్యయనం చెబుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories