"ట‌చ్ చేసి చూడు"ను రిజ‌క్ట్ చేసిన టాప్ హీరో

"ట‌చ్ చేసి చూడు"ను రిజ‌క్ట్ చేసిన టాప్ హీరో
x
Highlights

రెండేళ్ల గ్యాప్ త‌రువాత రాజా ది గ్రేట్ తో హిట్ కొట్టిన మాసామ‌హ‌రాజ త‌నకు అచ్చొచ్చిన పోలీస్ పాత్రల‌తో అల‌రిస్తున్నాడు. అయితే విక్ర‌మ్ సిరికొండ...

రెండేళ్ల గ్యాప్ త‌రువాత రాజా ది గ్రేట్ తో హిట్ కొట్టిన మాసామ‌హ‌రాజ త‌నకు అచ్చొచ్చిన పోలీస్ పాత్రల‌తో అల‌రిస్తున్నాడు. అయితే విక్ర‌మ్ సిరికొండ డైర‌క్ష‌న్ లో ప‌వ‌ర్ ఫుల్ ఆఫీస‌ర్ పాత్ర‌లో ట‌చ్ చేసి చూడు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు.
ఫ‌స్టాప్ అంతా ఫ్లాట్ నేర‌ష‌న్ తో న‌డిచిన ఇంట‌ర్వెల్ బ్యాంగ్ హైలెట్ గా నిలిచింద‌ని చెప్పుకోవాలి. ఆ ట్విస్ట్ తో సెకెండాఫ్ పై అంచాలు పెరుగుతాయి. కానీ సెకెండ్ ఆఫ్ లో కొత్త‌సీసాలో పాత సారా అన్న చందంగా సినిమా ఉండ‌డం ప్రేక్ష‌కుల స‌హ‌నాన్ని ప‌రీక్షించింది. సెకెండ్ ఆఫ్ లో కొన్ని యాక్ష‌న్ సీన్స్ పెట్టి మ‌మా అనిపించాడు. క‌థా ఆసాంతం ఫ్లాట్ గా ఉండ‌డం 147 నిమిషాల ర‌న్ టైం కూడా లెంగ్తీగా ఉండ‌డం ప్రేక్ష‌కుల‌కు చిరాకు తెప్పిచింది.
సినిమాలో ప్ల‌స్ లు మైన‌స్ ల విష‌యానికొస్తే ప్ర‌తీసినిమాలో చెప్పుకునే ర‌వితేజ ఎన‌ర్జిటిక్ యాక్టింగ్ ఆక‌ట్టుకుంటుంది. హీరోయిన్ల‌తో రొమాంటిక్ సీన్లు, ఇంట‌ర్వెల్ బ్యాంగ్ ఫ‌ర్వాలేద‌ని పిస్తోంది. సినిమా స్టోరీ బ‌ల‌హీన‌మైన స్టోరీ , ఫ‌స్టాఫ్ అంతా ఫ్లాట్ గా న‌డ‌వ‌డం , ఎడిటింగ్ లో లోపాలు స్పష్టంగా క‌నిపిస్తాయి. దీంతో బాక్సాఫీస్ వ‌ద్ద నిల‌దొక్కుకోలేక ఛ‌లో కంటే వెన‌క‌బ‌డిపోయింది. ఇక ట‌చ్ చేసి చూడు క‌థ‌ను డైర‌క్ట‌ర్ సిరికొండ తొల‌త విక్ట‌రీ వెంకటేష్ కు వినిపించిన‌ట్లు తెలుస్తోంది. అయితే వెంక‌టేష్ కు వ‌చ్చిన ఏ స్టోరీ అయినా రామానాయాడు కంపౌండ్ లో అడుగు పెడితే ఫ‌స్ట్ నిర్మాత సురేష్ బాబు ద‌గ్గ‌రికి వెళ్లాల్సిందేనంట‌. ఆయ‌న ఓకే అంటే వెంక‌టేష్ ఓకే చేస్తాడంట‌. లేదంటే చేయ‌డంట. అలా ట‌చ్ చేసి చూడు పోలీస్ పాత్రలో మొద‌ట వెంక‌టేష్ అనుకున్నా ఆ స్టోరీ సురేష్ బాబుకు న‌చ్చ‌కపోవ‌డంతో రిజెక్ట్ చేశాడంట‌. ఒక‌వేళ ఈ సినిమా విక్ట‌రీ చేసి ఉంటే బాగుండేద‌ని ప‌లువురు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇప్ప‌టికే రెండు షేడ్లు ఉన్న పాత్ర‌ల్ని వెంక‌టేష్ అవ‌లీల‌గా యాక్ట్ చేశాడు. ఓ వైపు పోలీస్ అధికారిగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తూనే ఫ్యామిలీ షేడ్స్ ఉన్న వాటిల్లో న‌టించాడు. కాబ‌ట్టే డైర‌క్ట‌ర్ వెంక‌టేష్ ద‌గ్గ‌రికి వెళితే సురేష్ బాబు రిజక్ట్ చేశాడ‌ని, ఆ తరువాత ర‌వితేజ‌కు క‌థ చెప్పి న‌చ్చ‌డంతో సెట్ పైకి వ‌చ్చింది. లేదంటే ఈ సినిమాను వెంకటేషే చేయాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories