వనస్థలిపురంలో దారుణం.. ఒకటో తరగతి చిన్నారి మృతి

వనస్థలిపురంలో దారుణం.. ఒకటో తరగతి చిన్నారి మృతి
x
Highlights

ముక్కుపచ్చలారని చిన్నారి... అల్లారుముద్దుగా పెరిగిన ఆ ఇంటి యువరాణి. ఆడుతూ పాడుతూ తిరిగే వయసు.. గోరుముద్దలు పెడితే గానీ తినలేని పసి వయసు. ఇదిగో ఇలా...

ముక్కుపచ్చలారని చిన్నారి... అల్లారుముద్దుగా పెరిగిన ఆ ఇంటి యువరాణి. ఆడుతూ పాడుతూ తిరిగే వయసు.. గోరుముద్దలు పెడితే గానీ తినలేని పసి వయసు. ఇదిగో ఇలా విగతజీవిగా పడిపోయింది. శనివారం తెల్లవారగానే హైదరాబాదీలను కలచివేసింది ఈ దారుణం వనస్థలిపురంలో చోటుచేసుకుంది. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ పెరిగిన చిన్నారికి... అంతలోనే ఆయుష్షు నిండిందని తెలిసీ కన్న గుండె పగిలిపోయింది. అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.

ఈ పాపం ఎరిది? కనీస జాగ్రత్తలు తీసుకోకుండా.. ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా... బస్సు నడిపిస్తున్న పాఠశాల యాజమాన్యానిదా.. నిర్లక్ష్యంగా బస్సు నడిపిస్తున్న డ్రైవర్‌దా?
ఏమైతేనేం.. ఎలాగైతేనేం..ఓ చిన్నారి ఊపిరి ఆగిపోయింది ఓ కన్నతల్లికి కడుపు కోత మిగిలింది!!

ఈ చిన్నారి అంజలి వయసు కేవలం ఐదేళ్లు. శనివారంతో నూరేళ్లు నిండిపోయాయి. పాఠశాలకని బయల్దేరిన చిన్నారి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. తనేంటో తెలియని వయస్సు ఆ చిన్నారిది.... అసలు తానెటు వెళ్తున్నానో తెలియని పసితనం ఆ చిన్నారిది. అందంగా తయారు చేసి... ముద్దుగా ముద్దలు పెట్టి... గోముగా లాలించిన ఆ తల్లి... తనను ఎక్కడికి పంపిస్తుందో తెలియని అమాయకత్వం ఆ చిన్నారిది. బస్సు ప్రయాణమంటే ముచ్చట పడే చిన్నారి... పాఠశాలకు వెళ్తూ ముందు సీట్లో కూర్చోవడమే తను చేసిన పాపం.

కచ్చితంగా చెప్పాలంటే... పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యమే ఆ పసిదాని ప్రాణాలను తీసిందంటున్నారు స్థానికులు. కళ్లముందే నిర్లక్ష్యం కనిపిస్తున్నా యాజమాన్యం పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాని ఫలితమే తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చిందని భగ్గుమంటున్నారు. వనస్థలిపురంలోని ప్రశాంతి విద్యానికేతన్‌లో ఒకటో తరగతి చదువుతున్న అంజలి... పాఠశాల బస్సు చక్రాల కింద పడి నలిగి... దుర్మరణం పాలైంది. డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేయడంతో ఈ ప్రమాదం జరిగింది.

బస్సు ముందు సీట్‌లో విద్యార్థులు కూర్చుకున్నప్పుడు డోర్‌ వేయాలని, కనీసం క్లీనర్‌‌ను ఉంచి జాగ్రత్తలు తీసుకోవాలన్న కనీస నిబంధనను పట్టించుకోకుండా బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నది అక్కడ ప్రత్యక్షంగా చూసి వారెవరికైనా అర్థం అవుతుంది.

అసలు ప్రమాదం ఎలా జరిగింది? నిర్లక్ష్యం అంతలా ఆవహించింది డ్రైవర్‌నా.? పాఠశాల యాజమాన్యన్నా? ప్రమాదానికి కారణాలు అన్వేషించడం ముఖ్యమే కావచ్చు కానీ ఆ చిన్నారి కన్నవాళ్ల కడుపుకోతను ఎవరు తీరుస్తారు? ఆ కన్నీటిని ఎవరు ఆపుతారు. చిన్నారి అంజలి ఆయుష్షు అంతలోనే తీరిపోయిందని తెలుసుకున్న కన్నవాళ్లు ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. ఇది పగవారికి కూడా రాకూడదని దారుణమైన ఘటన. ఆవేదనతో కుమిలి.. అస్థి పంజరమై మిగిలిన చిన్నారి తల్లిదండ్రులది అంతులేని ఆవేదన. ఎవరూ తీర్చలేని వేదన.

Show Full Article
Print Article
Next Story
More Stories