సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు గుండెల్లో పరిగెడుతున్న రైళ్లు

సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు గుండెల్లో పరిగెడుతున్న రైళ్లు
x
Highlights

అమెరికాలో ఉన్న భారత సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గుండెల్లో మళ్లీ రైళ్లు పరుగెడుతున్నాయి.. వివాదాస్పద హెచ్ వన్ బి వీసాల విధానాన్ని సమగ్రంగా ప్రక్షాళన చేయాలని...

అమెరికాలో ఉన్న భారత సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గుండెల్లో మళ్లీ రైళ్లు పరుగెడుతున్నాయి.. వివాదాస్పద హెచ్ వన్ బి వీసాల విధానాన్ని సమగ్రంగా ప్రక్షాళన చేయాలని ట్రంప్ నిర్ణయించడంతో అక్కడున్న భారతీయుల గుండెల్లో గుబులు రేగుతోంది. తాజా రూల్స్ ప్రకారం పని దొరకని భారతీయులను నిర్దాక్షిణ్యంగా వెనక్కు పంపించే ఆస్కారముంది.. దీంతో అక్కడున్న భారతీయులు బిక్కు బిక్కు మంటున్నారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్లీ హెచ్ వన్ బీ వీసాల తుట్ట కదుపుతున్నారు.. అమెరికాలో ఉన్న భారతీయులపై మరోసారి ఆంక్షల కొరడా ఝుళిపించనున్నారు.
హెచ్ వన్ బి వీసా హోల్డర్లకు సంబంధించి ఒబామా హయాం నుంచి అమల్లో ఉన్న వర్క్ రూల్ ను తొలగించాలని ట్రంప్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. అదే గనక అమలైతే వేలాది మంది భారతీయ కుటుంబాలు మళ్లీ రోడ్డున పడతాయి. 2015 నుంచి హై స్కిల్డ్, లేదా హెచ్ వన్ బి వీసా హోల్డర్ల భాగస్వాములు గ్రీన్ కార్డుల కోసం వేచి చూస్తున్నారు.. ఒబామా ప్రభుత్వం అప్పట్లో వీరిని అమెరికాలో పనిచేసేందుకు వీలుగా హెచ్ 4 డిపెండెంట్ వీసాను అందిస్తామని ప్రకటించింది.
2016లో 41 వేలమందికి హెచ్ 4 వీసాలు దొరికాయి. ఈ ఏడాది జూన్ వరకూ 36 వేలమందికి హెచ్ 4 వీసాలు జారీ అయ్యాయి.
హెచ్ వన్ బి వీసా ప్రోగ్రామ్ స్కిల్డ్ లేబర్ ని ఎప్పటినుంచో ఆకర్షిస్తోంది. ప్రత్యేకించి భారత, చైనా దేశీయులే ఈ ప్రోగ్రామ్ పట్ల ఎక్కువ ఆకర్షితులవుతున్నారు. అయితే ఉద్యోగాల విషయంలో అమెరికన్లకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలంటూ ట్రంప్ ఈ ఏడాది మొదట్లో ఆదేశాలు జారీ చేశారు. దాంతో హెచ్ వన్ బి నాన్ ఇమ్మిగ్రంట్స్ నుంచి కొంతమంది హెచ్ 4 వీసా కలిగిన వారిని తొలగించాలని అమెరికా హోమ్ లాండ్ సెక్యూరిటీశాఖ ప్రతిపాదిస్తోంది.
సిఎన్ ఎన్ ఛానెల్ సమాచారం ప్రకారం హెచ్ వన్ బి వీసా హోల్డర్ల భాగస్వాములకు పని దక్కకపోడమే కాదు.. పని దొరకని వారిని అమెరికాలోనూ ఉండనిచ్చే వీలు ఉండదు. గతంలో భార్యా, భర్తా ఇద్దరిలో ఏ ఒక్కరికి ఉద్యోగం ఉన్నా.. ఇద్దరూ అక్కడే ఉండే వీలుండేది.. తాజా ఆదేశాల ప్రకారం పని దొరకని వారు వెనక్కు రావాల్సిందే.
ట్రంప్ నిర్ణయాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ కూడా తప్పు బట్టింది. ఇది కష్టపడేవారిని, సొంతంగా వ్యాపారాలు చేసుకునే వారినీ దెబ్బ తీస్తుందని,అక్కడే పుట్టి అమెరికా పౌరసత్వం పొందిన వారి పిల్లలకూ ఇబ్బందే అవుతుందని వ్యాఖ్యానించింది.
అమెరికాలో ఉంటున్న విదేశీయుల్లో తెలివైన వారు, బాగా పనిచేసే వారినే ఉద్యోగాల్లో ఉంచేలా వీసాల విధానంలో కొన్ని కొత్త రూల్స్ చేరుస్తారని సిఎన్ ఎన్ అంటోంది. హెచ్ వన్ బీ వీసా హోల్డర్ల భాగస్వాములనూ పనిచేసేలా అనుమతిస్తూ ఒబామా జారీ చేసిన రూల్ ఇప్పటికే కోర్టులో ఉంది.2015లో సేవ్ జాబ్స్ యూఎస్ ఏ పేరిట ఓ గ్రూప్ కోర్టు కెక్కింది.
ట్రంప్ ప్రభుత్వం హెచ్ వన్ బీ వీసాల ప్రోగ్రామ్ నే సమగ్రంగా మార్పు చేయాలని చూస్తోంది. 70 శాతం హెచ్ వన్ బీ వీసాలను కలిగి ఉన్న అక్కడి భారతీయుల గుండెల్లో ఇప్పుడు గుబులు రేగుతోంది.సాధారణంగా హెచ్ వన్ బి వీసా మూడేళ్ల వరకూ అమల్లో ఉంటుంది.. ఆ తర్వాత మరో మూడేళ్లకు పొడిగించుకునే వీలుంది. ఏడాదికి దాదాపు 85 వేలమంది ఈ ప్రోగ్రామ్ ద్వారానే అమెరికాకు వెడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories