15 వీడియోల్లో గ‌జ‌ల్ శ్రీనివాస్..?

15 వీడియోల్లో గ‌జ‌ల్ శ్రీనివాస్..?
x
Highlights

లైంగిక వేధింపుల కేసులో అరెస్టై ఊచ‌లు లెక్క‌పెడుతున్న గ‌జ‌ల్ శ్రీనివాస్ గురించి మ‌రికొన్ని సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఆలయవాణి వెబ్...

లైంగిక వేధింపుల కేసులో అరెస్టై ఊచ‌లు లెక్క‌పెడుతున్న గ‌జ‌ల్ శ్రీనివాస్ గురించి మ‌రికొన్ని సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి.
ఆలయవాణి వెబ్ ఛానల్ లో పని చేసే ఉద్యోగి కుమారి త‌న‌ని గజల్ శ్రీనివాస్ లైంగికంగా వేధించాడంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా బాధితురాలితో గ‌జ‌ల్ బ‌ల‌వంతంగా మసాజ్‌ చేయించుకుంటున్న వీడియోలను బాధితురాలు పోలీసులకు అందజేసింది. గజల్ ఆఫీస్‌లో బెడ్‌రూం ఏర్పాటు చేసుకున్నారంటూ దీనికి సంబంధించిన ఆధారాలను కుమారి పోలీసులకు ఇచ్చింది. అయితే బాధితురాలు అంద‌జేసిన ఆధారాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న పోలీసులు గ‌జ‌ల్ ను అరెస్ట్ చేసి జైలుకు త‌ర‌లించారు.
ఇదిలా ఉంటే గ‌జ‌ల్ రెండో సారి బెయిల్ పిటిష‌న్ ను కోర్టు కొట్టేసిన‌ట్లు తెలుస్తోంది. బెయిల్ పై బ‌య‌టికి వ‌స్తే సెల‌బ్రిటీ హోదాలో ఉన్న గ‌జ‌ల్ బాధితురాలిని బెదిరించే అవ‌కాశం ఉంద‌ని , పోలీసులు కౌంట‌ర్ దాఖ‌లు చేశారు. ఇరుప‌క్షాల వాద‌న‌లు విన్న‌కోర్ట్ బెయిల్ ఇచ్చేందుకు అంగీక‌రించాలేదు.
కాగా కోర్టులో కేసు విచార‌ణ‌లో ఉండ‌గా బాధితురాలు మ‌రికొన్ని వీడియోలు పోలీసులకు ఇచ్చిన‌ట్లు స‌మాచారం.
కుమారి దాదాపు మ‌రో 15వీడియోలు పోలీసులకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వీటిలో ఆమె స్వయంగా వేధింపులకు గురైనవి కూడా ఉన్నాయని తెలుస్తోంది. తనతో పాటు పలువురు బాధితులు ఉన్నట్లు ఆమె వెల్లడించారు. ప్రసారం చేయలేని స్థితిలో వీడియోలు ఉన్నాయని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories