న‌లుగురు హీరోల‌తో జ‌క్క‌న్న సినిమా..?

న‌లుగురు హీరోల‌తో జ‌క్క‌న్న సినిమా..?
x
Highlights

డైర‌క్ట‌ర్ రాజ‌మౌళి కొత్త సినిమాపై అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బాహుబ‌లి సినిమా విడుద‌లై 10నెల‌లు అవుతున్నా కొత్త సినిమా ఊసెత్త‌లేదు. అయితే...

డైర‌క్ట‌ర్ రాజ‌మౌళి కొత్త సినిమాపై అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బాహుబ‌లి సినిమా విడుద‌లై 10నెల‌లు అవుతున్నా కొత్త సినిమా ఊసెత్త‌లేదు. అయితే రాజ‌మౌళి డైర‌క్ష‌న్ లో డీవీవీ దానయ్య నిర్మాత గా మల్టీస్టారర్ సినిమా తెరెక్కుతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అందుకు ఊతం ఇచ్చేలా రాజ‌మౌళి, ఎన్టీఆర్ , రాంచ‌ర‌ణ దిగిన ఫోటో ఒక‌టి నెట్టింట్లో హాట్ గాపిగ్గా మారింది. దీనికి తోడు ఈ మ‌ల్టిస్టార‌ర్ లో ర‌వితేజ విల‌న్ యాక్ట్ చేస్తార‌ని టాక్ . ఇప్పుడు వీటికి తోడుగా అల్లు అర్జున్ కూడా ఇందులో కీలకమైన ఒక క్యామియో చేస్తాడనే టాక్ ఊపందుకుంది.

ఎన్ని పుకార్లు వ‌స్తున్నా రాజ‌మౌళి సైలెంట్ గా ఉన్నాడంటే స్టోరీకి మెరుగులు దిద్దుతున్నాడ‌నే అర్ధం చేసుకోవాలంటున్నారు ఆయ‌న అభిమానులు . దీనికి తోడు విజయేంద్ర‌ ప్రసాద్ కథ ఏనాడో సిద్ధం చేసారని , స్క్రిప్ట్ వర్క్ ఓ కొలిక్కి వ‌స్తే ప్రకటన చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఇక క్రిటిక్స్ అంచనా ప్ర‌కారం వంద‌కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్క‌నున్న‌ట్లు టాక్. మూవీ సెట్ పైకి వ‌స్తే డిజిటల్ రైట్స్, శాటిలైట్ హక్కులు, ఆన్ లైన్ స్ట్రీమింగ్, ఆడియో-వీడియో ఇలా అన్నింటి నుంచి బాహుబలిని మించే రికార్డులు సెట్ చేయటం ఖాయంగా కనిపిస్తోంది.

మ‌రోవైపు నాస్తికుడైన రాజ‌మౌళి తాను రాంచ‌ర‌ణ్ - ఎన్టీఆర్ తో తీసే మ‌ల్టిస్టార‌ర్ గురించి మంత్రాలయంలో గ్రహాల అనుకూలత కోసం పూజలు చేయించార‌ట‌. బాహుబలి 2 సినిమా వరకు ఆయనకు శుక్ర దశ నడిచిందట. కానీ ఇప్పుడు శుక్ర మహార్దశ పూర్తవడంతో.. రాబోయే దశకి గ్రహాల అనుకూలత కోసం పూజలు చేయించాలని పండితులు చెప్పిన మాటని.. అక్షరాలా పాటిస్తున్నాడట రాజమౌళి. అందువ‌ల్లే రాజ‌మౌళి మంత్రాలయంలో పూజలు జరిపిస్తున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. వీట‌న్నింటిపై జ‌క్క‌న్న స్పందిస్తే ఓ క్లారిటీ వ‌స్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories