200 మంది అమ్మాయిలకి కత్తి మహేష్ ఆడిషన్

200 మంది అమ్మాయిలకి కత్తి మహేష్ ఆడిషన్
x
Highlights

ప‌వ‌న్ క‌ల్యాణ్ ను టార్గెట్ చేస్తూ క్రిటిక్ క‌త్తిమ‌హేష్ విమ‌ర్శిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో క‌త్తిమ‌హేష్ గురించి కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన...

ప‌వ‌న్ క‌ల్యాణ్ ను టార్గెట్ చేస్తూ క్రిటిక్ క‌త్తిమ‌హేష్ విమ‌ర్శిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో క‌త్తిమ‌హేష్ గురించి కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. క‌త్తిమ‌హేష్ గురించి ఆయ‌న గురువు, సినీ నటుడు, నిర్మాత రాంకీ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కత్తి మహేష్‌ని ఇండ‌స్ట్రీకి తీసుకొచ్చి త‌ప్పు చేసిన‌ట్లు చెప్పుకొచ్చారు. ‘రిపోర్టర్’ అనే సినిమాతో ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇచ్చిన క‌త్తి మ‌హేష్ త‌న విచిత్ర‌మైన ప్ర‌వ‌ర్త‌న‌తో యూనిట్ మొత్తానికి విసుగుతెప్పించాడ‌ని ..అందుకే ఆ సినిమా నుంచి మహేష్‌ని తప్పించి.. ఎన్. శంకర్‌తో ప్రస్తుతం చిత్రీకరణను పూర్తి చేసినట్లు చెప్పారు.

క‌త్తిమ‌హేష్ కు సినిమాలు తీయ‌డం రాద‌ని మండిప‌డ్డారు. టీఫిన్ ఆల‌స్యంగా తీసుకొచ్చార‌ని సెట్ నుంచి వెళ్లిపోవ‌డం. సీన్ కు సంబంధించి యాక్ష‌న్ చెప్పి ఫేసుబ్ కు చాట్ చేసుకోవ‌డం. దీంతో తామే క‌ట్ చెప్పామ‌ని అన్నారు. అంతేకాదు సీనియర్‌ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు లాంటి వారు ఓపికగా పనిచేస్తుంటే.. మహేష్ నిర్లక్ష్యంగా వెళ్లిపోయాడు. కాబ‌ట్టే ఆ సినిమా నుంచి అత‌న్ని తొల‌గించినట్లు చెప్పారు. ఇక ఆడిష‌న్ పేరుతో యూనిట్ కు చుక్క‌లు చూపించార‌ని చెప్పుకొచ్చారు. ఆడిష‌న్ చేసే ప‌నిని మ‌హేష్ కు అప్ప‌గిస్తే ..200మంది అమ్మాయిల్లో త‌న‌కు ఎవ‌రు న‌చ్చ‌లేద‌ని రిజెక్ట్ చేశాడు. ఆడిషన్‌కి వచ్చిన అమ్మాయిలకి ఇప్పటికీ కత్తి మహేష్ మెసేజ్‌లు పెడుతున్నాడని వారి నుంచి నాకు ఫిర్యాదులొస్తున్నాయ‌ని అన్నారు. ప్రస్తుతం ఆ సినిమా పూర్తయింది.. అందులో కత్తి మహేష్ పేరుని తీసేసి రిలీజ్ చేస్తాం. ఒకవేళ పెట్టాల్సి వస్తే మాత్రం సినిమా మొత్తాన్ని చెత్త బుట్టలో వేసేస్తా’ అని రాంకీ వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories