పార్ల‌మెంట్ లో పోర్న్ సైట్లని చూడ‌నివ్వండి..మొర‌పెట్టుకున్న ఎంపీలు

పార్ల‌మెంట్ లో పోర్న్ సైట్లని చూడ‌నివ్వండి..మొర‌పెట్టుకున్న ఎంపీలు
x
Highlights

మ‌న‌దేశ పార్ల‌మెంట్ లో , అసెంబ్లీల‌లో ప్ర‌జాప్ర‌తినిధులు ఆయా స‌మ‌స్య‌ల గురించి చ‌ర్చిస్తారు. వాటిని ప‌రిష్కారం దిశ‌గా ప్ర‌య‌త్నం చేస్తారు. కానీ ఆదేశ...

మ‌న‌దేశ పార్ల‌మెంట్ లో , అసెంబ్లీల‌లో ప్ర‌జాప్ర‌తినిధులు ఆయా స‌మ‌స్య‌ల గురించి చ‌ర్చిస్తారు. వాటిని ప‌రిష్కారం దిశ‌గా ప్ర‌య‌త్నం చేస్తారు. కానీ ఆదేశ ప్ర‌జా ప్ర‌తినిధులు ప్ర‌జ‌ల బాగోగులు ప‌క్క‌న‌పెట్టి పోర్న్ సైట్లు చూసేందుకు యాక్సిక్ ఇవ్వాల‌ని మొర‌పెట్టుకుంటున్నార‌ట‌. అలా ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 24,473సార్లు అర్జీలు పెట్టుకున్నారు. బ్రిట‌న్ పార్ల‌మెంట్ (హౌజ్‌ ఆఫ్‌ పార్లమెంట్‌) లో ఉన్న ఎంపీలు పోర్న్ సైట్లు చూసేందుకు అనుమ‌తివ్వాల‌ని కోరుతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.
గత ఏడాది జూన్‌ నుంచి డిసెంబర్‌ వరకు బ్రిట‌న్ పార్ల‌మెంట్ లో ఏం జ‌రుగుతుంద‌నే విష‌యాన్ని ఫ్రీడమ్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ (ఎఫ్‌ఓఐ) పేరిట బ్రిటన్‌ ప్రెస్‌ అసోసియేషన్‌ సేకరించింది. ఆ వివ‌రాల ఆధారంగా పార్ల‌మెంట్ లో ఉన్న 8500 కంప్యూట‌ర్ల‌కి అశ్లీల వెబ్‌సైట్‌లు యాక్సెస్‌ ఇవ్వాలని రోజుకు 160 రిక్వెస్ట్‌లు వచ్చినట్లు తెలిసింది. ఈ విష‌యం తెలుసుకున్న ఆ దేశ ప్ర‌ధాని థెరిసా మే ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ చ‌ర్య‌లు తీసుకున్నారు. ఇక ప్ర‌ధాని స్నేహితుడైన మంత్రి డామియన్‌ గ్రీన్‌పై లైంగిక ఆరోప‌ణలు రావ‌డంతో అత‌న్ని తొల‌గించారు.
ఇదిలా ఉంటే పోర్న్ సైట్ల‌కు యాక్సిస్ ఇవ్వాల‌ని రిక్వెస్ట్లు మాత్రం భారీ స్థాయిలోనే.. ఎంపీలు అలాగే కింది స్తాయి సిబ్బంది అందరికీ అక్కడ కంప్యూటర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే మొబైల్స్ ఉన్నాయి. వీటికి పోర్న్ వెబ్‌సైట్ యాక్సిస్ తొలగించారు. కాగా రిక్వెస్ట్లు మాత్రం భారీ స్థాయిలోనే వస్తున్నాయట వీటి నుంచి.

Show Full Article
Print Article
Next Story
More Stories