అద్య‌క్ష ప‌ద‌వికి ట్రంప్ అన‌ర్హుడు: క‌్లింట‌న్

అద్య‌క్ష ప‌ద‌వికి ట్రంప్ అన‌ర్హుడు: క‌్లింట‌న్
x
Highlights

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ ప‌ద‌వికి అన‌ర్హుడని విమ‌ర్శించారు డెమొక్ర‌టిక్ పార్టీ అధ్య‌క్ష అభ్య‌ర్థిగా పోటీ చేసిన హిల్ల‌రీ క్లింట‌న్. తాను...

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ ప‌ద‌వికి అన‌ర్హుడని విమ‌ర్శించారు డెమొక్ర‌టిక్ పార్టీ అధ్య‌క్ష అభ్య‌ర్థిగా పోటీ చేసిన హిల్ల‌రీ క్లింట‌న్. తాను గ‌త ఎన్నిక‌ల్లో అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేసి ఓడిపోయిన విష‌యం తెలిసిందే. ట్రంప్ గెలుస్తార‌ని ఎవ‌రు ఊహించ‌లేద‌న్నారు ఆమె. పారిస్‌ ఒప్పందంపై సంతకాల విషయంలో అన్ని దేశాలను ఒప్పించటంలో భారత్‌ పెద్దన్నపాత్ర పోషించిందని ప్రశంసించారు.

ముంబైలో ఇండియాటుడే సదస్సు – 2018లో హిల్ల‌రి క్లింట‌న్ పాల్గొన్నారు. ట్రంప్ పై విరుచుకుప‌డ్డారు. ట్రంప్‌ పాలన తీరు, అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం, అంతర్జాతీయంగా పెరుగుతున్న భారత ప్రాభవం వంటి పలు అంశాలపై ఆసక్తికర విష‌యాల‌ను వెల్లడించారామె. రష్యా తీరును అంతర్జాతీయ సమాజంలో తీవ్రంగా వ్యతిరేకించినందునే.. పుతిన్‌కు తానంటే వ్యక్తిగతంగా నచ్చదని హిల్లరీ పేర్కొన్నారు.

దీని కార‌ణంగానే 2016 అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో త‌న‌కు వ్య‌తిరేకంగా సోష‌ల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని తెలిపారు. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశార‌న్నారు. త‌ప్పుడు స‌మాచారం ప్ర‌చారం చేయ‌డానికి సోష‌ల్ మీడియా ఓ ఆయుధంలా మారిందన్నారు. ఇది సమాజంలో సామరస్యాన్ని దెబ్బతీస్తుందని హిల్లరీ అభిప్రాయపడ్డారు. అలాగే భారత సమాజంలోనూ విభేదాలు సృష్టించేందుకు సోష‌ల్ మీడియాను ఎవ‌రైనా ప్ర‌య‌త్నించ‌వ‌చ్చ‌ని తెలిపారు.

అమెరికా అధ్య‌క్ష స్థానానికి ట్రంప్ స‌రైన వ్య‌క్తి కాద‌న్నారు హిల్ల‌రీ క్లింట‌న్. అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రచారం సంప్రదాయపద్ధతిలో జరిగిందని చెప్పిన ఆమె.. కీల‌క అంశాలను స్పృశించానన్నారు. అయితే.. ట్రంప్‌ ప్రచారం ఓ టీవీ రియాల్టీ షోలా సాగిందన్నారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తనదే విజయమని భావించానని హిల్లరీ తెలిపారు. అమెరికాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరముందన్నారు. అమెరికాలో ప్రశ్నించే గొంతుల‌కు స్థానం లేకుండా చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్రజలు ఒకరిపై ఒకరు విషం చిమ్ముకునేందుకు సోష‌ల్ మీడియానే కారణమవుతోందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories