మంత్రికేటీఆర్ కు షాక్..జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఓట‌మి

మంత్రికేటీఆర్ కు షాక్..జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఓట‌మి
x
Highlights

జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీకి గ‌ట్టి షాక్ త‌గిలింది. దీంతో మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. రాష్ట్ర విభ‌జ‌న‌కు ముందు 2012లో...

జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీకి గ‌ట్టి షాక్ త‌గిలింది. దీంతో మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. రాష్ట్ర విభ‌జ‌న‌కు ముందు 2012లో జ‌రిగిన ఈ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ విజ‌యం సాధించింది. కానీ రాష్ట్రం సిద్ధించి ఎన్న‌డూలేని విధంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్ఎంసి) యూనియన్ ఎన్నికల్లో అధికార పార్టీ ఓడిపోవ‌డం సంచ‌ల‌నంగా మారింది.
జీహెచ్ ఎంసీ యూనియ‌న్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీకి అనుసంధానంగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ (జిహెచ్ఎఈయూ) కు బీజేపీకి అనుసంధానంగా ఉన్న భాగ్యనగర్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ (బిఎంఈయ) కు మ‌ధ్య ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల ప్ర‌చారంలో టీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ సిఎం మొహమ్మద్ అలీ, మంత్రి నాయని నర్సింహా రెడ్డి, టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి, శాసనసభ్యుడు వి శ్రీనివాస్ గౌడ్, తదితర నేతలు ఈ ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేశారు. బీఎంఈయూ త‌రుపున స్థానిక బీజేపీ నేత‌లు ప్ర‌చారం చేశారు.
అయితే అనూహ్యంగా ఈ ఎన్నిక‌ల్లో భాగ్యనగర్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ .., గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ ను 1317ఓట్ల తేడాతో ఓడించింది. ఈ ఎన్నిక‌ల్లో మొత్తం ఓమ‌ట్లు 4,260ఓట్లు పోల‌వ్వ‌గా అందులో టీఆర్ఎసవ‌గ‌్ అనుబంధ జిహెచ్ఎీఆయూ 1,317 ఓట్ల భారీ మెజారిటీతో ఓడిపోయింది.
2014 స్థానిక ఎన్నిక‌లు, ఆ త‌రువాత వ‌చ్చిన ఆర్టీసి, హైదరాబాదు మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సీవరెజ్ 0బోర్డు యూనియన్ల ఎన్నికలు, సింగ‌రేణి ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ విజ‌యం సాధించింది. అయితే వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న ప్ర‌భుత్వానికి జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డం గ‌మ‌నార్హం.
ఈ ఓటిమిపై మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌లేక‌పోవ‌డం వ‌ల్లే ఓటమి పాలు కాకతప్పలేదని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories