ఎయిడ్స్ ఎలా వస్తుంది..

ఎయిడ్స్ ఎలా వస్తుంది..
x
Highlights

ప్రతి సంవత్సరం డిసెంబర్‌ 01 న ప్రపంచ ఎయిడ్స్‌ డే ని జరుపుకుంటున్నాము. ఎయిడ్స్ గురించి ప్రజలకు అవగాగన కలిగించడానికి " ప్రపంచ ఆరోగ్య సంస్థ " సూచనల...

ప్రతి సంవత్సరం డిసెంబర్‌ 01 న ప్రపంచ ఎయిడ్స్‌ డే ని జరుపుకుంటున్నాము. ఎయిడ్స్ గురించి ప్రజలకు అవగాగన కలిగించడానికి " ప్రపంచ ఆరోగ్య సంస్థ " సూచనల మేరకు 1988 నుంచి డిసెంబర్ 01 న " ప్రపంచ ఎయిడ్స్ డే" గా పాటించడం జరుగుతోంది . 1981 జూన్‌ 5 వ తేదీన మొదటిసారి అమెరికాలో నలుగురు స్వలింగ సంపర్కుల్లో గుర్తించిన ఎయిడ్స్ నేడు ప్రపంచ వ్యాప్తము గా కొన్ని కోట్ల మందికి సోకింది . ఇండియాలో మొదటిసారిగా 1986 లో ఎయిడ్స్ ను గుర్తించారు . . భారతదేశము లో " నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాం " అనేది 1987 లో మొదలైనది.

హెచ్‌ఐవి మరియు ఎయిడ్స్…
హెచ్‌ఐవి వైరసు ఉన్న అందరికి ఎయిడ్స్ ఉన్నట్టు కాదు. శరీరం లోపల హెచ్‌ఐవి వైరసు ఉన్నా కూడ కొన్ని సంవత్సరాలపాటు ఆరోగ్యంగానే కనిపిస్తారు. వారి ఆరోగ్యం ఎపుడైతే క్షిణిస్తుందో అపుడు ఎయిడ్స్ వచ్చనట్టు పరిగిణంచటం జరుగుతుంది.

ఎయిడ్స్ ఎలా వస్తుంది..
లైంగిక సంపర్కం ద్వారా, రక్తం ద్వారా, పచ్చబోట్టు పొడిపించుకోవటం ద్వారా, వ్యాధి గ్రస్తుని రక్తదానం వలన ఎయిడ్స్ వ్యాపిస్తుంది. క్షవరం, సుంతి, ఇంజెక్షన్ వంటి వాటి వల్ల సోకే ప్రమాదం లేకపోలేదు.

ఎయిడ్స్ లక్షణాలు..
హెచ్‌ఐవి వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తరువాత 3 నెలల నుండి 6 నెలల వరకు రక్త పరీక్షల ద్వారా వైరస్ జాడ గుర్తించటం కష్టం. దీనినే విండో పిరిడ్ అంటారు. ఎయిడ్స్ వున్న వారికి ఈ క్రింది లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం, నోటి పూత, చర్మవాధులు, నీరసం, నీళ్ళ విరేచనాలు, ఆకలి తగ్గిపోవుట, ఆలసట, పదిశాతం బరువును కోల్పోవడం, గ్రంధుల వాపు మొదలైన హెచ్‌ఐవి వ్యాధి లక్షణాలు కనపడుతాయి. వైరసు కొంతమంది శరీరంలో ప్రవేశించాక, పై రుగ్మతలు కనిపించవచ్చు, కనపించకపోవచ్చు. హెచ్‌ఐవికి చికిత్సకు సంబందించి ముఖ్యంగా ఏఆర్‌టి ( యాంటీ రిట్రోవైరల్ థెరఫీ) లేదా ఎఆర్‌వి ( యాంటీ రిట్రోవైరల్) అనే మందులను అవి పని చేసే తీరును బట్టి వెర్వెరు తరగుతుగా విభజిస్తారు.

ఎయిడ్స్‌ని అరికట్టడం…
ఎయిడ్స్‌ను పూర్తిగా నివారించే చికిత్స ప్రస్తుతానికి లేదు. నివారణే మార్గం. ప్రభుత్వం అన్ని రిఫరల్ ఆసుపత్రులలో స్వచ్చందంగా రక్తం పరీక్షించుకోవడానికి, సరియైన సలహాలు పొందటానికి విసిటిసి కేంద్రాలను ఏర్పాటు చేసింది. కేంద్రాలు ఏర్పాటు చేయటంతోనే సరిపోదు. ఎయిడ్స్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలి. నలుగురు కలిసి మాట్లాడుకుంటున్న సమయంలో చర్చ జరగాలి. గ్రామీణా ప్రాంతాల్లో ప్రజలను చైతన్యవంతులను చేయాలి. ప్రజా ప్రతినిధులు, అధికారులు, ముఖ్యంగా వైద్యులు, వైద్య సిబ్బంది, ఎఎన్‌ఎమ్, ఆశా కార్యకర్తలు, గ్రామీణ ప్రాంతాలో వైద్యం చేసే ఆర్‌ఎంపిలు, స్వచ్చంద సేవా సంస్ధలు ప్రజలను ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తే ఎయిడ్స్‌ను నిర్ములించకపోయినా, నివారించేందుకు ఎంతగానో దోహదపడుతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories