రేపు శ్రీవారి ఆలయం మూసివేత

రేపు శ్రీవారి ఆలయం మూసివేత
x
Highlights

చంద్రగ్రహణం కారణంగా 27వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 28వ తేదీ తెల్లవారు జామున 4.15 గంటల వరకు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం మూసివేస్తున్నట్లు టీటీడీ...

చంద్రగ్రహణం కారణంగా 27వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 28వ తేదీ తెల్లవారు జామున 4.15 గంటల వరకు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం మూసివేస్తున్నట్లు టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు బుధవారం మీడియాకు వెల్లడించారు . శుక్రవారం రాత్రి 11.54కు చంద్రగ్రహణం ప్రారంభమై శనివారం ఉదయం 3.49 వరకు ఉంటుంది. ఈ కారణంగా గ్రహణం సమయానికంటే 6 గంటలు ముందుగా ఆలయద్వారాల మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. కాగా శనివారం సుప్రభాతసేవ అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చనసేవలను ఏకాంతంగా నిర్వహించిన అనంతరం సర్వదర్శనం ప్రారంభమవుతుందని జేఈవో తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories