13 రాష్ట్రాలకు డేంజర్ బెల్స్... పిడుగుపాటుకు ఇదీ అసలు కారణం

13 రాష్ట్రాలకు డేంజర్ బెల్స్... పిడుగుపాటుకు ఇదీ అసలు కారణం
x
Highlights

మీరు బయటకు వెళ్తున్నారా..లేదంటే ఏదైనా లాంగ్ జర్నీలో ఉన్నారా..? అయితే..ఈ అలెర్ట్ మీ కోసమే..ఎందుకంటే..మనదేశపు వాతావరణంలో ఏ క్షణంలోనైనా పెనుమార్పులు...


మీరు బయటకు వెళ్తున్నారా..లేదంటే ఏదైనా లాంగ్ జర్నీలో ఉన్నారా..? అయితే..ఈ అలెర్ట్ మీ కోసమే..ఎందుకంటే..మనదేశపు వాతావరణంలో ఏ క్షణంలోనైనా పెనుమార్పులు సంభవించే అవకాశం ఉంది. మార్పులవరకైతే పర్వాలేదు....కానీ....ఆకాశం వేలాది పిడుగుల్ని ఒక్కసారే కుమ్మరించబోతంది. పిడుగులతో పాటు తుఫాను , ఉరుములు, మెరుపులు, వడగళ్ళు ఒకేసారి మీ మీద ముప్పేట దాడి చేసే ఛాన్స్ ఉంది.

ఒక్కసారిగా వాతావరణంగా ఇన్ని మార్పులా... అనుకునేలోపే పిడుగు పడగ విప్పుతుంది. అంతవానలోనూ ఆకాశం నుంచి నిప్పులు కురుస్తాయ్. లక్షల ఓల్టుల విద్యుత్‌శ్చక్తి ఉన్న పిడులు ఎక్కడ పడతాయో..ఎవరి బలిగొంటాయో..చెప్పలేం. దేశంలోని ఆకస్మిక వాతావరణ మార్పుల ముప్పు పొంచి ఉంది. 13 రాష్ట్రాలకు వాతావరణ శాఖ డేంజర్ బెల్స్ మోగించింది. రాగల 48 గంటల్లో 13 రాష్ట్రాల్లో వేలాది పిడుగులపడే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. జమ్ము కశ్మీర్‌, ఢిల్లీ, రాజస్థాన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తర ప్రదేశ్, ఉత్తారాఖండ్‌, ఛత్తీస్ గఢ్, హర్యానా, బెంగాల్, ఒడిశా, సిక్కింలతో పాటు ఈశాన్య రాష్ట్రాలను అధికారులు అప్రమత్తం చేశారు. పిడుగులు ఎక్కువగా మారుమూల ప్రాంతాల్లో పడే అవకాశముందని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది.

పిడుగులే కాదు... 13 రాష్ట్రాల్లో తుపాన్‌ కూడా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎడారి ప్రాంతాల్లో ఇసుక తుఫాన్ ముంచెత్తే చాన్సుందని అలెర్ట్ చేశారు. కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులువీచే అవకాశం ఉందని, పంజాబ్, హరియాణ రాష్ట్రాల్లో భారీ గాలులతోపాటు వడగళ్ల వాన కురియవచ్చని అధికారులు హెచ్చరించారు. రాజస్థాన్‌లో వర్షాలు కురవడంతో ధూళి తుఫాను, ఉరుములతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. ఢిల్లీలో చెదురుముదురు వర్షాలతోపాటు పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు.

భారీ సంఖ్యలో పిడుగుల పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర హోం శాఖ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. వర్షం పడే సమయంలో ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరించింది, సోమ, మంగళవారాల్లో పాఠశాలు, కళాశాలలు మూసివేయాలని హర్యానా సర్కారు ఆదేశాలిచ్చింది. ప్రయాణాలు రద్దు చేసుకోవాలని ఢిల్లీ సర్కారు కూడా సూచించింది. ముఖ్యంగా విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories