ముదురుతున్న శిల్ప ఆత్మహత్య వివాదం

ముదురుతున్న శిల్ప ఆత్మహత్య వివాదం
x
Highlights

రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన రూయా డాక్టర్ శిల్ప ఆత్మహత్య కేసు విచారణ ఆలస్యంపై మెడికోలు మండిపడుతున్నారు. శిల్ప ఆత్మహత్య కేసును అన్ని కోణాల్లో...

రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన రూయా డాక్టర్ శిల్ప ఆత్మహత్య కేసు విచారణ ఆలస్యంపై మెడికోలు మండిపడుతున్నారు. శిల్ప ఆత్మహత్య కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నామని చెబుతున్న అధికారులు అసలు నిందితులను మాయం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప.... అసలు నిందితులకు శిక్షపడటం లేదని మండిపడుతున్నారు.

డాక్టర్ శిల్ప ఆత్మహత్య వివాదం మరింత ముదురుతోంది. రాజకీయ అండ చూసుకునే ప్రొఫెసర్లు రెచ్చిపోతున్నారని...డాక్టర్ శిల్ప మృతికి కారకులైన హెచ్‌ఓడీ, మరో ఇద్దరు ప్రోఫెసర్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రొఫెసర్ల వేధింపులకు విద్యార్థిని చనిపోతే.. కేవలం ప్రిన్సిపల్‌ను సస్పెండ్‌ చేసి, ప్రొఫెసర్లను బదిలీ చేసి చేతులు దులుపుకోవడం దారుణమన్నాయి.

సిఎం చంద్రబాబే ఈ ఘటనపై సిరియస్‌గా తీసుకుని విచారణకు ఆదేశించినా ఫలితం లేకుండా పోయిందని పిజీ వైద్యుల సంఘం నేతలు ఆవేనద చెందుతున్నారు. శిల్ప మరణానికి కారణాలేంటో బయటి ప్రపంచానికి తెలియకుండా చేస్తున్నారని వాపోయారు. సిఐడి, సిట్‌ విచారణలో ఏముందో తమకు తెలియని డిమాండ్‌ చేస్తున్నారు. అన్ని కేసుల్లానే ఈ కేసును మరుగున పడేయాలని చూస్తే తమ ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

మొత్తానికి శిల్ప కేసు అధికారుల అలసత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఇప్పటికైనా సర్కారు సిరీయస్‌గా తీసుకుని శిల్ప చావుకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.శిల్పకు న్యాయం జరిగే వరకు తమ ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories