ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం అప్పుడే..!

ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం అప్పుడే..!
x
Highlights

దేశవ్యాప్త పర్యటనలో భాగంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతలను కలుస్తున్నారు సీఎం కేసీఆర్. ఇందులో భాగంగా నిన్న(ఆదివారం) ఒడిశా ముఖ్యమంత్రి...

దేశవ్యాప్త పర్యటనలో భాగంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతలను కలుస్తున్నారు సీఎం కేసీఆర్. ఇందులో భాగంగా నిన్న(ఆదివారం) ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో భేటీ అయ్యారు.. ఆ తరువాత సీఎం నివాసంలోనే కేసీఆర్‌ బసచేశారు. ఇవాళ ఉదయం కుటుంబ సమేతంగా పూరీ జగన్నాథుని దర్శనం చేసుకుంటారు. కోణార్క్ లోని సూర్య దేవాల‌యాన్ని సంద‌ర్శిస్తారు. తిరిగి భువనేశ్వర్‌ చేరుకొని సాయంత్రం కోల్‌కతా వెళ్లనున్నారు. ఫె‌డ‌ర‌ల్ ఫ్రంట్‌కు సంబంధించి ప‌శ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సాయంత్రం కేసీఆర్ స‌మావేశం కానున్నారు. మంగళవారం నుంచి సీఎం కేసీఆర్‌ మూడు రోజులు ఢిల్లీలోనే ఉంటారు. ప్రధాని మోడీని మర్యాద పూర్వకంగా కలుస్తారు.

అలాగే కేంద్రమంత్రులతోనూ సమావేశమవుతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తారు. అనంతరం సీఈసీతోను భేటీ అవుతారు.ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు, సమాజ్ వాది పార్టీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్, బహుజన్ సమాజ్ వాది పార్టీ అధ్యక్షురాలు మాయావతితో కేసీఆర్‌ సమావేశం అవుతారు. వీరితో ఫెడరల్ ప్రెంట్ అంశంపై చర్చిస్తారు. అనంతరం తెలంగాణకు తిరిగి వస్తారు. కాగా కేసీఆర్ వివిధ రాష్ట్రాల పర్యటన కోసం ఓ విమానాన్ని నెలరోజుల పాటు బుక్ చేసినట్టు సమాచారం. కేసీఆర్ తన పర్యటనను ముంగించుకుని వచ్చిన తర్వాతే తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories