అవతరణకు అంతా సిద్ధం... వేడుకలకు భారీ బందోబస్తు

అవతరణకు అంతా సిద్ధం... వేడుకలకు భారీ బందోబస్తు
x
Highlights

తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలుకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సర్వ సిద్దమైంది. ఈ కార్యక్రమానికి రెండు వేల ఐదువందల మంది పోలీసులతో బారీ...

తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలుకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సర్వ సిద్దమైంది. ఈ కార్యక్రమానికి రెండు వేల ఐదువందల మంది పోలీసులతో బారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పరేడ్ గ్రౌండ్ ను పోలీసులు ఆదీనంలోకి తీసుకొని.. ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వేడుకలు నేపధ్యంలో పరేడ్ గ్రౌండ్ లో పోలీసులు నిర్వహించిన రిహార్సల్స్ అందరిని ఆకట్టుకున్నాయి.

జూన్ 2 న గన్ పార్క వద్ద నివాళులర్పించిన అనంతరం.. సీఎం కేసీఆర్, నేరుగా సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్‌ కు చేరుకుంటారు. ఉదయం 10గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తరువాత పోలీస్ పరేడ్, పలు రంగాలలో ప్రతిభ కనబరచిన వారికి అవార్డులను ప్రధానం ఉంటుంది.

పోలీసులతో పాటు ఆక్టోపస్ బలగాలను కూడా రంగంలోకి దింపి.. బందోబస్తు ఏర్పాటు చేసినట్టు సీపీ అంజని కుమార్ తెలిపారు. ఇక వీఐపీ, అధికారులు, ప్రజా ప్రతినిధులు.. తమకు నిర్దేశించిన ప్రాంతాల్లోనే వాహనలు పార్క్ చేయాలన్నారు. ఇక గ్రౌండ్ మొత్తాన్ని రెండు రోజులుగా తమ ఆదీనంలోకి తీసుకొని బాంబ్ అండ్ డాగ్ స్క్వాడ్ తో ముమ్మర తనికీలు చేశారు.

పరేడ్ కార్యక్రమంలో తొమ్మిది బెటాలియన్లు, మౌంటెడ్ పోలీస్, రెండు బ్యాండ్ బృందాలు కవాతు చేయనున్నాయి. దీనిలో బాగంగానే పరేడ్ గ్రౌండ్ లో అన్ని విభాగాలకి చెందిన పోలీసులు పరేడ్ రిహార్సల్స్ నిర్వహించారు. ఇక అవార్డులు ప్రదానోత్సవం కార్యక్రమంపై కూడా రిహార్సల్స్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో జనరల్ పబ్లిక్ కోసం ప్రత్యేక గ్యాలరీ ని ఏర్పాటు చేశారు. వేడుకులు ముగిసే వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories