ఓటమి చెందిన ప్రముఖులు వీరే..

ఓటమి చెందిన ప్రముఖులు వీరే..
x
Highlights

ఈ ఎన్నికలకు ఓ ప్రత్యేకత ఉంది. తెలంగాణలో దశాబ్దాలుగా గెలుస్తూ వస్తున్న కరుడుగట్టిన సీనియర్ నేతలు, తాజా మాజీ మంత్రులు ఓటమి చెందారు. ఎగ్జిట్‌ పోల్స్‌కు ఏ...

ఈ ఎన్నికలకు ఓ ప్రత్యేకత ఉంది. తెలంగాణలో దశాబ్దాలుగా గెలుస్తూ వస్తున్న కరుడుగట్టిన సీనియర్ నేతలు, తాజా మాజీ మంత్రులు ఓటమి చెందారు. ఎగ్జిట్‌ పోల్స్‌కు ఏ మాత్రం అందకుండా టిఆర్‌ఎస్‌ అద్భుత విజయం సాధించింది. ఇంత గాలిలోనూ అధికార పార్టీకి చెందిన నలుగురు మంత్రులు ఓడిపోవడం విశేషం..

ఖమ్మం జిల్లా పాలేరులో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుకు ఎదురుదెబ్బ తగిలింది. అలాగే కొల్లాపూర్‌ నుంచి మరో మంత్రి జూపల్లి కృష్ణారావు, ములుగు నుంచి చందూలాల్‌, తాండూర్‌నుంచి మహేందర్‌రెడ్డి ఊహించని విధంగా ఓటమి పాలయ్యారు. ఇక స్పీకర్‌ మధుసూదనాచారి సైతం ఈ ఎన్నికల్లో ఓటమి చెందడం విశేషం.
అలాగే వివిధ పార్టీల్లో పేరుమోసిన లీడర్లు ఓడిపోయారు. వారిలో..

జానారెడ్డి (నాగార్జున సాగర్‌)
కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి (నల్గొండ)
రేవంత్‌ రెడ్డి (కొడంగల్)
డీకే అరుణ్‌ (గద్వాల)
చిన్నారెడ్డి(వనపర్తి)
ఉత్తమ్‌ పద్మావతిరెడ్డి (కోదాడ)
సర్వేసత్యనారాయణ (కంటోన్మెంట్‌)
గీతారెడ్డి (జహీరాబాద్‌)
షబ్బీర్‌ ఆలీ (కామారెడ్డి)
ఆర్‌ కృష్ణయ్య (మిర్యాలగూడ)
పొన్నాల లక్ష్మయ్య(జనగాం)
జీవన్‌ రెడ్డి (జగిత్యాల)
వంశీచంద్ రెడ్డి(కల్వకుర్తి)
సంపత్‌ (అలంపూర్‌)
టీడీపీనుంచి నందమూరి సుహాసిని(కూకట్ పల్లి)
నామా నాగేశ్వరరావు(ఖమ్మం).
బీజేపీ నుంచి లక్ష్మణ్(ముషీరాబాద్)
జీ. కిషన్ రెడ్డి(అంబర్ పేట)
చింతల రామచంద్రారెడ్డి(ఖైరతాబాద్)
ఎన్వీఎస్ ప్రభాకర్(ఉప్పల్)

Show Full Article
Print Article
Next Story
More Stories