కాంగ్రెస్ లోని ఈ నేతలకు సీట్లు కన్ఫార్మ్..?

కాంగ్రెస్ లోని ఈ నేతలకు సీట్లు కన్ఫార్మ్..?
x
Highlights

తెలంగాణలో కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు పడుతూలేస్తూ సాగుతున్నాయి. ఒంటరిగా వెళ్లి కేసీఆర్‌కు ప్రభుత్వాన్ని అప్పజెప్పడం కంటే కలిసి పోటీ చేసి...

తెలంగాణలో కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు పడుతూలేస్తూ సాగుతున్నాయి. ఒంటరిగా వెళ్లి కేసీఆర్‌కు ప్రభుత్వాన్ని అప్పజెప్పడం కంటే కలిసి పోటీ చేసి టీఆర్ఎస్‌ను ఓడించాలని నిర్ణయించుకున్నాయి వివిధ పార్టీలు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహాకూటమిగా ఏర్పడ్డాయి. మహాకూటమి సంగతి అటుంచితే.. కాంగ్రెస్ పార్టీలో గత పది రోజుల నుంచి సీట్ల సర్దుబాటుపై చర్చ జరుగుతున్నా ఒక్కటీ కొలిక్కి రాలేదు. అక్టోబర్ 12 నాటికి అభ్యర్ధులను ప్రకటించేసి కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ ప్రకటించాలనుకుంది కాంగ్రెస్. చర్చల్లో స్పీడు పెంచాలని నిర్ణయించింది. ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందని చెప్పుకొచ్చింది. కానీ, పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. పైగా కొన్ని సెటిలర్స్ నియోజకవర్గాల్లో అయితే సీట్ల సర్దుబాటు సవాల్ గా మారింది. కూకట్ పల్లి నుంచి మహాకూటమి తరుపున తానే బరిలో ఉంటానని అంటున్నారు టీడీపీ నేత పెద్దిరెడ్డి. మరోవైపు సెటిలర్స్ కోటాలో కూకట్ పల్లి నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్నారు కాంగ్రెస్ నేత ఏలూరి రామచంద్రారెడ్డి. ఈ పంచాయితీ మరో పది రోజులు ఉండేట్టుగా కనిపిస్తోంది. మరోవైపు శేరిలింగంపల్లి , ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అయితే మెజారిటీ నేతలు క్యామ మల్లేశ్‌కు అవకాశమివ్వాలని డిమాండ్ చేస్తుండగా.. ఆయనతోపాటు కాంగ్రెస్ నేత మల్‌రెడ్డి రంగారెడ్డి పేరును కూడా పరిశీలిస్తున్నారు. అలాగే పరకాల అసెంబ్లీ స్థానానికి మాజీ మంత్రి కొండా సురేఖ పేరును దాదాపు ఖరారు చేసినట్టు ప్రచారం జరుగుతున్నా.. అక్కడ మరో నేత వెంకట్రామిరెడ్డి పేరును కూడా పరిశీలిస్తున్నారు. అలాగే కరీంనగర్‌ అసెంబ్లీ స్థానానికి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ పేరుతోపాటు మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు నేరెళ్ల శారద పేరునూ పరిశీలిస్తున్నారు. పొన్నం ప్రభాకర్ పేరును దాదాపు ఫిక్స్ చేసింది అధిష్టానం. కాంగ్రెస్ అభిమానినంటూ ఇటీవల పార్టీలో చేరిన సినీ నిర్మాత బండ్ల గణేష్ తనకు షాద్ నగర్ కాకుండా జూబిలీహిల్స్ టికెట్ కావాలని అడుగుతున్నారు. కానీ ఇక్కడ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి పాగా వేశారు. ఆయనకు మొండిచెయ్యి చూపడం అసాధ్యమని అంటున్నారు కాంగ్రెస్ నేతలు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం కాంగ్రెస్ లోని ముప్పై మంది నేతలకు టిక్కెట్లు కన్ఫర్మ్ అయ్యేలా కనిపిస్తోంది వారిలో.. ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (హజూర్‌నగర్‌), కె. జానారెడ్డి (నాగార్జున సాగర్‌), మల్లు భట్టి విక్రమార్క (మధిర), దామోదర రాజనర్సింహ (అందోల్‌), కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (నల్లగొండ), సంపత్‌కుమార్‌ (అలంపూర్‌), వంశీచందర్‌రెడ్డి (కల్వకుర్తి), జి. చిన్నారెడ్డి (వనపర్తి), ఎ. రేవంత్‌రెడ్డి (కొడంగల్‌), దొంతి మాధవరెడ్డి (నర్సంపేట) ఎ. మహేశ్వర్‌రెడ్డి (నిర్మల్‌), ఆత్రం సక్కు (ఆసిఫాబాద్‌), నాయిని రాజేందర్‌రెడ్డి (వరంగల్‌ వెస్ట్‌), సునీతా లక్ష్మారెడ్డి (నర్సాపూర్‌), డి. శ్రీధర్‌బాబు (మంథని), గీతారెడ్డి (జహీరాబాద్‌), డి. కె. అరుణ (గద్వాల), షబ్బీర్‌ అలీ (కామారెడ్డి), పొన్నాల లక్ష్మయ్య (జనగామ), టి. జీవన్‌రెడ్డి (జగిత్యాల), సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), రేగా కాంతారావు (పినపాక), ఆరేపల్లి మోహన్‌ (మానకొండూరు), ముఖేశ్‌గౌడ్‌ (గోషామహల్‌), ఫిరోజ్‌ఖాన్‌ (నాంపల్లి), సంభాని చంద్రశేఖర్‌ (సత్తుపల్లి). మర్రి శశిధర్‌రెడ్డి (సనత్‌నగర్‌), భిక్షపతి యాదవ్‌ (శేరిలింగంపల్లి), సుధీర్‌రెడ్డి (ఎల్బీ నగర్‌), విష్ణువర్దన్‌రెడ్డి (జూబ్లీహిల్స్‌),

Show Full Article
Print Article
Next Story
More Stories