శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యేలు

శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యేలు
x
Highlights

నేడు తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు సందర్శించుకున్నారు. కొప్పుల ఈశ్వర్, మదన్ రెడ్డి, ఎమ్మోల్సీ భూపాల్ రెడ్డి తదితరులు వారి వారి...

నేడు తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు సందర్శించుకున్నారు. కొప్పుల ఈశ్వర్, మదన్ రెడ్డి, ఎమ్మోల్సీ భూపాల్ రెడ్డి తదితరులు వారి వారి కుటుంసమేతంగా శ్రీవారిని దర్శించుకుకొని మొక్కులు తీర్చుకున్నారు. అయితే శ్రీవారి దర్శనానికి చేరుకున్న అధికారులను దగ్గరుండి టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాటుచేశారు. కాగా దర్శనం ముగిసిన తరువాత ఆలయ రంగనాయకుల మండపంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల దంపతులకు వేదపండితులచే ఆశీర్వచనం అందించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు, పట్టువస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ఈరోజు శ్రీవారిని దర్శించుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఎమ్మెల్యే పగ్గాలు చేపట్టిన మొదటిసారి గుడికి రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. తాజాగా సిద్ధిపేట ఎమ్మెల్యే కూడా శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్న విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories