రెండో టెస్టులో టీమిండియా గెలుపు

రెండో టెస్టులో టీమిండియా గెలుపు
x
Highlights

టీమిండియా ఆటగాళ్లు విండీస్‌ను బెంబేలెత్తించారు. ఉప్పల్ లో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. 72 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన...

టీమిండియా ఆటగాళ్లు విండీస్‌ను బెంబేలెత్తించారు. ఉప్పల్ లో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. 72 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా విజయాన్ని అందుకుంది.రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ 127 పరుగులకే చాపచుట్టేసింది. ఆదివారం మూడో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఓపెనర్లు క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌, కీరన్‌ పావెల్‌ను డకౌట్‌గా పెవిలియన్‌కు పంపించిన భారత్‌.. ఆపై అదే దూకుడుతో విండీస్‌కు చుక్కలు చూపించింది. సునీల్‌ అంబ‍్రిస్‌(38;95 బంతుల్లో 4 ఫోర్లు), షాయ్‌ హోప్‌(28; 42 బంతుల్లో 4 ఫోర్లు) కాస్త భారత బౌలర్లను ప్రతిఘటించగా, మిగతా వారు చేతులెత్తేశారు. ఆరుగురు సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావడం గమనార్హం. ఫలితంగా భారత్‌కు 72 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. లక్ష చేధనకు దిగిన భారత్.. యువ ఆటగాళ్లు పృథ్వీ షా 33, కెఎల్ రాహుల్ 33 పరుగులతో భారత్ కు విజయాన్ని అందించారు. మొత్తంగ రెండు టెస్టుల సిరీస్ ను వైట్ వాష్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories