విజయమే మన లక్ష్యం... తమ్ముళ్లకు చంద్రబాబు దిశానిర్దేశం

విజయమే మన లక్ష్యం... తమ్ముళ్లకు చంద్రబాబు దిశానిర్దేశం
x
Highlights

ప్రతి ఎన్నికల్లో గెలుపు మనదే కావాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎవరు ఏ యాత్ర చేసినా వారికి తమ ప్రభుత్వం...

ప్రతి ఎన్నికల్లో గెలుపు మనదే కావాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎవరు ఏ యాత్ర చేసినా వారికి తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధే కనిపిస్తుంద‌ని జగన్‌, పవన్‌కళ్యాణ్‌లపై బాబు పంచ్ వేశారు. కర్ణాటక ఎన్నికల తర్వాత మీ సంగతి చూస్తాం అంటూ బీజేపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారన్న చంద్రబాబు.. టీడీపీని ఎవ్వరూ ఏమీ చేయలేరన్నారు. హక్కుల కోసం ధర్మపోరాటం కొనసాగుతుందని తేల్చిచెప్పారు. బాగా ప‌నిచేస్తున్న ఎమ్మెల్యేల‌కు ర్యాంకులు ప్రక‌టించారు చంద్రబాబు.

అమరావతి ప్రజాదర్బారు హాలులో చంద్రబాబు టీడీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. విభజన హామీలు నెరవేర్చే వరకు ధర్మ పోరాటం కొనసాగుతుందని చంద్రబాబు స్పష్టంచేశారు. న్యాయం కోసం సీఎంగా ప్రధానిపై పోరాడుతున్నానని చెప్పారు. ప్రజల కష్టాలు తీర్చేందుకు తెలుగుదేశం గెలుపు చారిత్రక అవసరమన్నారు. ఏప్రిల్‌లో ప్రభుత్వంపై 73శాతం సంతృప్తి నమోదైందని ముఖ్యమంత్రి తెలిపారు. దీనిని అవకాశంగా మలచుకుని ప్రతి ఎన్నికల్లో గెలవాలని దిశానిర్దేశం చేశారు. పార్టీలో కొందరు నాయకులు ఇప్పటికీ ప్రజాభీష్టానికి అనుగుణంగా పనిచేయలేకపోతున్నారని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లటంలో నేతలు విఫలం కావడం సరికాదన్నారు. దేశంలో ఎవరూ చేయని విధంగా అంబేద్కర్ స్మృతి వనానికి శ్రీకారం చుట్టామని.. దానిపై వైసీపీ రాజకీయ కుట్రను సమర్థంగా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.

వచ్చే నెల నవ నిర్మాణ దీక్షల సమయం నుంచి కొత్త పింఛన్లు ఇవ్వనున్నామని.. అర్హులందరికీ పింఛన్లు లభించేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు. మహిళలు నీళ్లు మోసుకెళ్ళే బాధలు తప్పిస్తూ ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వబోతున్నామని ప్రకటించారు. సమాజంలో విలువలు పడిపోయేటప్పుడు దాచేపల్లి తరహా ఘటనలు జరుగుతాయన్నారు. విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యతనిచ్చామని.. ప్రాథమిక విద్యలో రాష్ట్రం మొదటి 3 స్థానాల్లో ఉందన్నారు. ఏపీని ఇన్నోవేషన్ వ్యాలీగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజ‌ల‌కు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటున్నారా...ప్రజా స‌మ‌స్యలు ప‌రిష్కరిస్తున్నారా లేదా అని 5 ప్రశ్నల‌తో ప్రజాభిప్రాయం సేక‌రించిన చంద్రబాబు బాగా ప‌నిచేస్తున్న ఎమ్మెల్యేల‌కు ర్యాంకులిచ్చి అభినందించారు. అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, కొళ్ళ ల‌లిత కుమారి, తోట త్రిమూర్తులు, జోగేశ్వర‌రావు, రాధాకృష్ణ‌, నిమ్మల రామానాయుడు, చింత‌మ‌నేని ప్రభాక‌ర్‌, బోడె ప్రసాద్‌, గ‌ద్దె రామ్మోహ‌న్‌, ధూళిపాళ్ల న‌రేంద్రలకు మంచి మార్కులు వేశారు. మిగ‌తావారు కూడా ప‌నితీరు మెరుగు పరచుకోవాల‌ని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories