ప్యూచర్ సీఎం బాలయ్య

ప్యూచర్ సీఎం బాలయ్య
x
Highlights

ఏపీ సీఎం చంద్రబాబు వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ కోసం దావోస్‌ వెళ్లారు. ఈ నేపథ్యంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అమరావతిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో...

ఏపీ సీఎం చంద్రబాబు వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ కోసం దావోస్‌ వెళ్లారు. ఈ నేపథ్యంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అమరావతిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. హిందూపురం అభివృద్ధిపై చర్చించారు. త్వరలోనే రాబోయే లేపాక్షి ఉత్సవాల నిర్వహణపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇదంతా మామూలుగా జరిగితే.. పెద్ద విషయం కాదు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సాక్షాత్తు సీఎం కుర్చీలో కూచొని అధికారులతో సమీక్ష నిర్వహించడం చర్చనీయాంశమైంది. సీఎం చెయిర్‌లో కూచొని బాలయ్యబాబు నిర్వహించిన సమీక్షా సమావేశంలో పర్యాటక కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ మీనా, మంత్రి దేవినేని ఉమ తదితర అధికారులు పాల్గొన్నారు. అయితే సమావేశానికి వచ్చిన ఐఏఎస్‌ అధికారులు... ఎమ్మెల్యే బాలకృష్ణ సీఎం కుర్చీలో కూర్చోవడం చూసి విస్తుపోయారు. ముఖ్యమంత్రి పోస్ట్‌పై ఆసక్తి లేదని చెప్పే...ఆయన సాక్షాత్తూ.. సీఎం కుర్చీలో కూర్చొని సమీక్ష జరపడంపై విమర్శలు వెల్లువెత్తుతుంటే...ఈ వ్యవహారంపై మంత్రి దేవినేని ఉమ నోరు మెదపడం లేదు.


tdp mal balakrishna sits on chandrababu naidu chair - Sakshi

Show Full Article
Print Article
Next Story
More Stories