ప్ర‌భుత్వ‌మే ల‌క్ష్యంగా కొన‌సాగుతున్న ప‌వ‌న్ విమ‌ర్శ‌లు

ప్ర‌భుత్వ‌మే ల‌క్ష్యంగా కొన‌సాగుతున్న ప‌వ‌న్ విమ‌ర్శ‌లు
x
Highlights

జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏపీ ప్ర‌భుత్వాన్ని ల‌క్ష్యంగా చేస్తున్న విమ‌ర్శ‌లు కొన‌సాగుతున్నాయి. గ‌త సార్వ‌త్రిక‌ల్లో టీడీపీ - బీజేపీకి...

జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏపీ ప్ర‌భుత్వాన్ని ల‌క్ష్యంగా చేస్తున్న విమ‌ర్శ‌లు కొన‌సాగుతున్నాయి. గ‌త సార్వ‌త్రిక‌ల్లో టీడీపీ - బీజేపీకి మ‌ద్దతు ప‌లికిన జ‌న‌సేనాని స‌డ‌న్ గా స్టాండ్ మార్చారు. ఏపీని టీడీపీనేత‌లు అవినీతి అడ్డాగా మారుస్తున్నార‌ని హెచ్చ‌రించారు.
ఈనేప‌థ్యంలో రెబలా?.. అవకాశవాదా? చంద్రబాబు నిజంగానే కేంద్రంపై తిరగబడుతున్నారా?.. లేక 'హోదా' అంశాన్ని అవకాశవాద రాజకీయంగా మారుస్తున్నారా? అన్న అంశంపై నేష‌న‌ల్ మీడియా పవన్ కల్యాణ్ ను ప్రశ్నించింది. దీనిపై స్పందించిన పవన్.. చంద్రబాబు ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని అన్నారు. టీడీపీ, వైసీపీలు చేస్తున్నది కేవలం డ్రామా అని తేల్చేశారు. హోదా విషయంలో చంద్రబాబు చాలా ఆలస్యంగా స్పందించారని, ఒకవిధంగా ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు. టీడీపీ ప్రజల సెంటిమెంటుతో ఆడుకుందన్నారు. రాష్ట్రంలో ఎనిమిదేళ్ల పిల్లవాడిని అడిగినా ఇదే విషయం చెబుతారని అన్నారు.
ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ ఏపీ పై త‌న స్టాండ్ ఏంటో చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కావాలని డిమాండ్ చేసిన జ‌న‌సేనాని..ఇప్పుడేమో కేంద్రం ఆర్ధిక సహాయం చేస్తే బాగుంటుంద‌ని అన్నారు.
14ఆర్థిక సంఘం లెక్కల ప్రకారం రాష్ట్రానికి హోదా ఇవ్వడం సాధ్యం కాదంటోంది కేంద్రం. దానికి సరిసమానంగా ప్యాకేజీ పేరుతో 90శాతం నిధులు ఇవ్వడానికి కేంద్రం ముందుకు వస్తోంది. అయినా రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యంతరం దేనికి? అని ఇండియా టుడే పవన్‌ను ప్రశ్నించింది. కేంద్రానికి రాష్ట్రం పట్ల నిజంగా చిత్తశుద్ది ఉంటే.. ప్యాకేజీపై అర్థరాత్రి ప్రకటన చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని పవన్ ప్రశ్నించారు. ప్రజలకు ఒక స్పష్టత ఇవ్వకపోవడం వల్ల వాళ్లలో చాలా గందరగోళం నెలకొందన్నారు. ఇప్పటికైనా కేంద్రం ఏదో ఒకటి తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు.
పోలవరం విషయంలో చంద్రబాబు తీరును తప్పు పట్టారు పవన్. పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినప్పుడు.. దాని బాధ్యతను కేంద్రానికి వదిలేయకుండా రాష్ట్ర ప్రభుత్వమెందుకు తలకెత్తుకుందని ప్రశ్నించారు. ప్రైవేటు కాంట్రాక్టర్లకు పోలవరం ప్రాజెక్టును అప్పగించాల్సిన అవసరమేంటని నిలదీశారు.
బీజేపీకి మద్దతునిస్తారా?..: ఇక వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మద్దతునిస్తారా? అన్న ప్రశ్నకు.. వ్యక్తిగతంగా తనకు మోడీపై చాలా గౌరవం ఉందని, కానీ పాలిటిక్స్ విషయంలో ప్రజల పక్షమే ఉంటానని పవన్ స్పష్టం చేశారు. తన వ్యక్తిగత నిర్ణయాల కన్నా, ప్రజల నిర్ణయాలకు అనుగుణంగా తన రాజకీయాలు ఉంటాయన్నారు. రాష్ట్ర ప్రజల్లో మాత్రం బీజేపీ పట్ల స్పష్టమైన వ్యతిరేకత, ఆగ్రహం కనిపిస్తున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లలో పోటీ చేస్తామనేది సమీప భవిష్యత్తులో నిర్ణయిస్తామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories