కాస్టింగ్ కౌచ్ : ఎవ‌రితో పడితే వారితో వెళ్లొద్దు

కాస్టింగ్ కౌచ్ : ఎవ‌రితో పడితే వారితో వెళ్లొద్దు
x
Highlights

టాలీవుడ్‌లోనూ తెలుగు న‌టీ న‌టుల‌కు అవ‌కాశాలు ఇవ్వాల‌ని పోరాడుతున్న న‌టుల్లో శ్రీ‌రెడ్డి కూడా చేరిపోయింది. అయితే, టాలీవుడ్‌లో తెలుగువారికి అవ‌కాశాలు...

టాలీవుడ్‌లోనూ తెలుగు న‌టీ న‌టుల‌కు అవ‌కాశాలు ఇవ్వాల‌ని పోరాడుతున్న న‌టుల్లో శ్రీ‌రెడ్డి కూడా చేరిపోయింది. అయితే, టాలీవుడ్‌లో తెలుగువారికి అవ‌కాశాలు ద‌క్క‌క‌పోవడాని గ‌ల కార‌ణాల‌ను మీడియా వేదిక‌గా బ‌ట్ట‌బ‌య‌లు చేసింది శ్రీ‌రెడ్డి. తెలుగు న‌టీ న‌టులు నిర్మాత‌లతో, డైరెక్ట‌ర్ల‌తో, హీరోల‌తో ప‌డుకోక‌పోవ‌డ‌మే అవ‌కాశాలు రాక‌పోవ‌డానికి కార‌ణ‌మ‌ని బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెప్పింది. ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లుగా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న వారంతా అలా అవ‌కాశాలు చేజిక్కించుకున్న వారేనంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది శ్రీ‌రెడ్డి.
అయితే ఈ వ్యాఖ్య‌ల‌పై ద‌ర్శ‌క‌, నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్పందించారు.
కాస్టింగ్ కౌచ్ గురించి యాక్ట‌ర్స్ చేస్తున్న కామెంట్స్ ని అర్ధం చేసుకోవాల‌ని అన్నారు. అయితే ఇదంతా పెద్ద‌పెద్ద‌ప్రొడ‌క్ష‌న్ హౌస్ జ‌ర‌గ‌ద‌ని తాను అనుకుంటున్న‌ట్లు చెప్పుకొచ్చారు. వాళ్లు చెప్పిన డైర‌క్ట‌ర్ల‌ల‌లో ఒక‌రిద్ద‌రు ఉన్నార‌ని, అది నిజ‌మో కాదో త‌న‌కు తెలియ‌దని సూచించారు. ఎప్పుడైన ఇంత ఓపెన్ గా వచ్చినపుడు ఆ పేర్లు బయడట పెడితే కశ్చితంగా ఇండస్ట్రీ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది... అని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.
అంతేకాదు ఇండ‌స్ట్రీ సంబంధించి కొన్ని ప‌ద్ద‌తుల్ని పాటించాలని కోరారు. అవకాశాలు కల్పిస్తామ‌ని ఇచ్చే యాడ్స్ ను ఎవ‌రు న‌మ్మొద్దు అని స్ప‌ష్టం చేశారు. ఇలాంటి యాడ్స్ ఇచ్చిన యాజ‌మాన్యాల‌కు ఫోన్ చేసి తీయించేసిన‌ట్లు , ఆ త‌రువాత విరివిరిగా యాడ్స్ ఇస్తున్నార‌ని తెలిపారు.
వెండితెర‌పై వెలిగిపోవాల‌ని ప్ర‌తీఒక్క‌రు కోరుకుంటారు. అలాంటి వారు త‌మ‌కు అన్యాయం జ‌రుగుతుంటే ఎదిరించాలి. అమ్మాయిల‌యితే మ‌నం వెళుతున్న‌వాడు ఎలాంటి వాడో తెలుసుకొని వెళ్లాల‌ని అన్నారు. అలా తెలుసుకోలేదంటే అది అమ్మాయిల త‌ప్పు అవుతుంద‌ని త‌మ్మారెడ్డి తెలిపారు.
ఇండ‌స్ట్రీలో మీడియేట‌ర్లు పుట్ట‌గొడుగుల్లా పుట్టుకొస్తున్నార‌ని, అలాంటి వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌సరం ఎంతైనా ఉంది. కాస్టింగ్ కౌచ్ గురించి బోల్డ్ గా చెబుతున్న అమ్మాయిల్ని నేను అభినందిస్తున్నాను. అయితే ఎంత బోల్డ్ గా వచ్చి మాట్లాడుతన్నారో అంతే బోల్డ్ గా వారి పేర్లు కూడా చెప్పండి. వారిపై చర్యలు తీసుకోవడానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది. వారు నిజంగా చెండాలంగా బిహేవ్ చేసి ఉంటే రూల్స్ ప్రకారం సస్సెండ్ చేసే అవకాశం కూడా ఉంది.... అని తమ్మారెడ్డి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories