సూర్య స్పీడ్ ను.. ఇంకెవరైనా అందుకోగలరా!

సూర్య స్పీడ్ ను.. ఇంకెవరైనా అందుకోగలరా!
x
Highlights

తమిళ స్టార్ హీరో సూర్య.. తోటి హీరోలకు సవాల్ విసురుతున్నాడు. ప్రస్తుతం తన కెరీర్ లో 36 వ సినిమాగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఎన్ జీ కే పేరుతో మూవీని...

తమిళ స్టార్ హీరో సూర్య.. తోటి హీరోలకు సవాల్ విసురుతున్నాడు. ప్రస్తుతం తన కెరీర్ లో 36 వ సినిమాగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఎన్ జీ కే పేరుతో మూవీని వేగంగా పూర్తి చేసేస్తున్నాడు. ఇది అయిపోకముందే.. 37, 38, 39వ సినిమాలను కూడా లైన్ లో పెట్టేసి ఎవరికీ అందనంత దూకుడును ప్రదర్శించేస్తున్నాడు. తెలుగులోనూ మాంఛి ఫాలోయింగ్ ఉన్న సూర్య దూకుడుతో.. అతన అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు.

తన 37వ సినిమాగా.. కేవీ ఆనంద్ దర్శకత్వంలో లైకా సంస్థ నిర్మాణంలో సూర్య ఓ మూవీకి ఓకే చెప్పేశాడు. గతంలో అయన్, మట్రాన్ సినిమాలు ఈ ఇద్దరి కాంబోలో వచ్చి విజయం సాధించగా.. ఇది హేట్రిక్ అవుతుందని నమ్ముతున్నారు. తర్వాత.. తమిళంలో ఇరుదు సుట్రు తో విజయం సాధించి తెలుగులో గురు గా రీమే క్ చేసిన దర్శకుడు సుధా కొంగరతో.. 38వ సినిమాను సూర్యా ఒకే చేశాడు. ఇలా వార్తలు వినిపించగానే.. 39వ సినిమా గురించి కూడా గుసగుసలు మొదలయ్యాయి. మనం సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు విక్రమ్ కుమార్ తో.. సూర్య ఆ సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది.

ఇలా.. ఒకదాన్నిమించి.. ఒకటి క్రేజీ కాంబోలు సెట్ చేస్తున్న సూర్యా.. ఇండస్ట్రీలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్లేస్ పైనే కన్నేసినట్టుగా ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. సూర్యా కాస్త పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకుంటే.. అదేమంత విషయం కాదని కూడా అభిమానులు అండగా నిలుస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories