వీరిలో ఎవరికి కీలక పదవి..?

వీరిలో ఎవరికి కీలక పదవి..?
x
Highlights

జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదరం రాజనరసింహ, సునీతా లక్ష్మారెడ్డి, రేవంత్ రెడ్డి.. ఇలా చెప్పుకుంటూపోతే లెక్క చాంతాడంత ఉంది....

జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదరం రాజనరసింహ, సునీతా లక్ష్మారెడ్డి, రేవంత్ రెడ్డి.. ఇలా చెప్పుకుంటూపోతే లెక్క చాంతాడంత ఉంది. గెలుస్తారనుకున్న కీలక నేతలు మొన్నటి ఎన్నికల్లో బోర్లా పడ్డారు. దాంతో సీఎల్పీ లీడర్ కోసం వెతుకులాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం గెలిచిన వారిలో ఒకరిద్దరికి మినహా పార్టీని నడిపించే సామర్ధ్యం లేదని విశ్లేషకుల అభిప్రాయం. సీఎల్పీకి.. టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నా.. ఒక నేతకు ఒక పదవి అన్న కండీషన్ ఉత్తమ్ ను వెంటాడుతోంది. దాంతో సీఎల్పీ రేసునుంచి ఉత్తమ్ తప్పుకున్నట్టు కనిపిస్తున్నారు.

ఇక మధిర ఎమ్మెల్యే భ‌ట్టి విక్రమార్క విషయానికొస్తే ప్రచార క‌మిటీ చైర్మన్‌గా ఉండి.. సీఎల్పీ బాధ్యతల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. గ‌తంలో డిఫ్యూటీ స్పీక‌ర్‌గా ప‌ని చేసిన అనుభ‌వం ఎలాగో ఉంది. ప్రస్తుతం గెలిచిన 19 మందిలో.. నలుగురు ఎస్సీలే ఉన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ద‌ళితుడికి ఇవ్వాల‌నుకుంటే భ‌ట్టి విక్రమార్కకే సీఎల్పీ దక్కే అవకాశం కనిపిస్తోంది.

మరోవైపు మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా సీఎల్పీ రేసులో ఉన్నారు. కానీ ఆయన ఎంతమేర న్యాయం చేస్తారని లెక్కలేసుకుంటోంది కాంగ్రెస్. శ్రీధర్ బాబుకు మంత్రిగా ప‌నిచేసిన అనుభ‌వం ఉంది. ఉన్నత విద్యావంతుడు.. వివాదరహితుడిగా పేరొందారు. వీటితోపాటు బ్రాహ్మణ సామజికవర్గం వైపు దృష్టిసారిస్తే మాత్రం శ్రీధర్ బాబుకు అవకాశం దక్కవచ్చు.

ఇక సీఎల్పీ పదవికి పోటీ పడుతున్నారు మాజీ హోమ్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మహేశ్వరం నుంచి గెలిచిన స‌బిత.. తనతోపాటు మరో ఇద్దరు గెలవడంలో ఆమెది కీలక పాత్ర. పైగా మహిళ కావడం సబితకు కలిసి వచ్చే అంశం. మరి సీఎల్పీ నేతను వీరిలో ఎవరికీ కేటాయిస్తారు.. వీరందరూ కాదని కొత్త నేతను ఎంపిక చేస్తారో తెలియాల్సివుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories