సచిన్ పైలట్‌కు నిరాశ.. రాజస్థాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్?

సచిన్ పైలట్‌కు నిరాశ.. రాజస్థాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్?
x
Highlights

రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి పీఠం సీనియర్ నేత అశోక్ గెహ్లాట్‌కు దక్కే అవకాశాలు పూర్తిగా కనిపిస్తున్నాయి. యువకుడై సచిన్ పైలెట్‌ కంటే సీనియర్ అయిన గెహ్లాట్‌...

రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి పీఠం సీనియర్ నేత అశోక్ గెహ్లాట్‌కు దక్కే అవకాశాలు పూర్తిగా కనిపిస్తున్నాయి. యువకుడై సచిన్ పైలెట్‌ కంటే సీనియర్ అయిన గెహ్లాట్‌ వైపే అధిష్టానం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. రాజస్థాన్ సీఎంగా ఆయన పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సచిన్ పైలట్ మద్దతుదారులు ఆందోళనకు దిగినట్టు సమాచారం. రాహుల్ గాంధీ ఫైనల్ కాల్ చేస్తానని తనతో చెప్పారని అశోక్ గెహ్లోట్ తన వర్గీయులతో చెప్పినట్టు తెలుస్తోంది. రాజస్థాన్ రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 200 స్థానాలుండగా 199 స్థానాలకు ఓటింగ్ జరిగింది. ఊహించినట్టే కాంగ్రెస్ 99 స్థానాలను కైవసం బీజేపీ 73, ఇతరులు 27 స్థానాలు సాధించారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి పాత సంప్రదాయమే కొనసాగింది. గత 25 ఏళ్లుగా ఏ పార్టీ వరసగా రెండోసారి అధికారాన్ని చేపట్టలేదు. తాజా ఫలితాల్లోనూ అధికార బీజేపీ ఓటమిపాలైంది. కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారాన్ని హస్తగతం చేసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories