విజయవాడలో సరోగసి దందా బయటపడింది. కార్తీకదత్తా ఐవీఎఫ్ సెంటర్‌లో అద్దె గర్భం దందా నడుస్తోంది. గుంటూరు నుంచి మహిళలను తీసుకొచ్చి అద్దె గర్భం కోసం మహిళలతో...
విజయవాడలో సరోగసి దందా బయటపడింది. కార్తీకదత్తా ఐవీఎఫ్ సెంటర్‌లో అద్దె గర్భం దందా నడుస్తోంది. గుంటూరు నుంచి మహిళలను తీసుకొచ్చి అద్దె గర్భం కోసం మహిళలతో బేరసారాలు చేస్తున్నారు. అయితే అద్దె గర్భానికి ఓ మహిళ నిరాకరించడంతో కార్తీకదత్తా ఐవీఎఫ్ సెంటర్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. నర్సింగ్ కోసమని చెప్పి గుంటూరు నుంచి ముగ్గురు మహిళలను తీసుకొచ్చిన కార్తీకదత్తా ఐవీఎఫ్ సెంటర్ యాజమాన్యం ఏమీ చెప్పకుండా ఏదో ఇంజక్షన్ ఇవ్వబోతుండగా ఓ మహిళ భయబ్రాంతులకు గురైంది. బాధితురాలు డయల్ 100కి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న విజయవాడ సూర్యారావుపేట పోలీసులు ఆస్పత్రిలో తనిఖీలు చేపట్టారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire