క‌మ‌ల్ కొత్త పార్టీ : క‌మ‌ల్ - ప‌వ‌న్ క‌ల్యాణ్ సేమ్ టూ సేమ్

క‌మ‌ల్ కొత్త పార్టీ : క‌మ‌ల్ - ప‌వ‌న్ క‌ల్యాణ్ సేమ్ టూ సేమ్
x
Highlights

త‌మిళ‌నాటు మ‌రోకొత్త పార్టీ పురుడు పోసుకుంది. హీరో క‌మ‌ల్ హాస‌న్ ఎప్ప‌టినుంచో రాజ‌కీయాల్లో రావాల‌ని ఉబ‌లాట‌ప‌డుతున్నారు. సినిమాల్లో యాక్ట్ చేస్తూ...


త‌మిళ‌నాటు మ‌రోకొత్త పార్టీ పురుడు పోసుకుంది. హీరో క‌మ‌ల్ హాస‌న్ ఎప్ప‌టినుంచో రాజ‌కీయాల్లో రావాల‌ని ఉబ‌లాట‌ప‌డుతున్నారు. సినిమాల్లో యాక్ట్ చేస్తూ ప్ర‌జా సేవ‌చేయ‌డం వేరు. పాలిటిక్స్ లోకి వ‌చ్చి ప్ర‌జా సేవ చేయడం వేర‌ని న‌మ్మే క‌మ‌ల్ ఎట్ట‌కేలకు *మక్కల్ నీది మయ్యమ్*గా పేరుతో పార్టీని స్థాపించారు. దీని అర్ధం పీపుల్స్ జ‌స్టిస్ పార్టీ . ఇక లోగో విష‌యానికి కొస్తే ఐకమ్యతానికి చిహ్నంగా ఆరు చేతులను ఒకదానితో మరో చేతిని పట్టించేసిన కమల్... వాటిన్నింటినీ వృత్తాకారంలో అమర్చేశారు. అదే సమయంలో ఆ చేతుల మధ్యలో ఓ నక్షత్రాన్ని కూడా పొందుపరిచారు.
పార్టీ పేరు మక్క‌ల్ నీతి మ‌య్య‌మ్ ఎందుకు పెట్టారో చెప్పిన క‌మ‌ల్ నేను మీలోంచి వచ్చిన వ్యక్తిని. తలైవాను మాత్రం కాదు. ఒక్కరోజు ఆట కోసం రాజకీయాల్లోకి రాలేదు. నాయకుడిగా భావించడం లేదు. సామాన్య జనంలో నుంచి పుట్టుకొచ్చిన ఒకడిని. ప్రజా సేవకుడిగా కొనసాగాలని భావిస్తున్నాను. ప్రజలకు ఎల్లప్పుడూ జవాబుదారీగా ఉంటాను* అని గొప్పగా ప్రకటించారు.
అయితే ఈ లోగోపై అనేక అనుమానాలు తెర‌పైకి వ‌చ్చాయి. తెలుగు నాట ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ స్థాపించిన జ‌న‌సేన ఎజెండా, లోగో సిద్ధాంతాలు అన్నీ ఒకేలా ఉన్నాయ‌నే మాట వినిపిస్తోంది. జ‌న‌సేన లోగో వృత్తాకారంలోనే ఉండగా దాని మధ్యలో నక్షత్రం ఉన్న విషయం తెలిసిందే. జనసేన లోగోను పోలినట్లుగానే ఉన్న కమల్ పార్టీ లోగో కూడా వృత్తాకారంలోనే ఉంది. అంతేకాకుండా జనసేన లోగోను కాపీ కొట్టిన చందంగా వృత్తం మధ్యలో స్టార్ను పెట్టేసిన కమల్... లోగోలో రంగుల విషయంలోనూ పవన్ను అనుకరించినట్లుగానే కనిపిస్తోంది. పవన్ జెండాలో ఎరుపు తెలుపు రంగులు మాత్రమే కనిపిస్తాయి.
ఇప్పుడు కమల్ ఆవిష్కరించిన తన పార్టీ లోగోలో కూడా ఈ రెండు రంగులే కనిపిస్తున్నాయి. వృత్తాకారంలోని ఆరు చేతుల్లో మూడు తెలుపు రంగులో ఉంటే... మిగిలిన మూడు ఎరుపు రంగులో ఉన్నాయి. ఇక వృత్తం మధ్యలో ఉన్న నక్షత్రం తెలుగు రంగులో ఉండేట్టులా కమల్ తన లోగోను ఆవిష్కరించారు. ఇక పవన్ లోగోలో కేవలం ఎరుపు తెలుపు రంగులు మాత్రమే కనిపిస్తుండగా అందుకు కాస్తంత భిన్నంగా ఎరుపు తెలుపులతో పాటుగా నక్షత్రం బ్యాక్ గ్రౌండ్ గా నలుపు రంగుకు కూడా కమల్ తన పార్టీ లోగోలో స్థానం కల్పించారు. ఇక వ్యవహార సరళి చూసినా... పవన్ కమల్ల మధ్య పోలికలు కనిపిస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది.
వామపక్ష భావాలనే బయటపెట్టేస్తున్న పవన్... తనకు ఉద్యమ నాయకుడు చెగువేరా అంటే ఇష్టమని ఆయన బాటలోనే తాను నడుస్తానని పవన్ చెబుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కమల్ హాసన్ కూడా కమ్యూనిస్టు నేతలా ఫోజు కొడుతూ వామపక్ష నేతలను కీర్తించడంతో... ఆయన కూడా పవన్ కల్యాణ్ బాటలోనే పయనిస్తున్నట్లుగా భావించక తప్పదు.

Show Full Article
Print Article
Next Story
More Stories